దుబ్బాక గడ్డ రీసౌండ్‌ వినాలి: రఘునందన్‌

తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని ఉప ఎన్నికలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు.

Updated : 11 Nov 2020 12:46 IST

సిద్దిపేట: తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని ఉప ఎన్నికలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలనకు దుబ్బాక ప్రజలిచ్చిన తీర్పు ప్రగతిభవన్‌కు వినిపించాలని చెప్పారు. సిద్దిపేటలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఓ వ్యక్తిని, కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులకు గురిచేయొచ్చు.. ఏ విధంగా అవహేళన చేయొచ్చనే వ్యవహారశైలికి ఈ తీర్పు కనువిప్పు కావాలన్నారు. రాష్ట్రంలోని నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలని రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. ఏ గడ్డపై చదువుకున్నానని సీఎం కేసీఆర్‌ చెప్పారో.. ఆ గడ్డ రీసౌండ్‌ వినాలని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ప్రచారంలో సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డితో పాటు బూత్‌స్థాయి కార్యకర్తలకు రఘునందన్‌ ధన్యవాదాలు తెలిపారు. తనతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భాజపా గెలుపును ఆకాంక్షించారన్నారు. దుబ్బాక నుంచి డల్లాస్‌ వరకూ తన విజయాన్ని కోరుకున్నారని చెప్పారు.   

ఇవీ చదవండి..

విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం

ఓటమికి బాధ్యత వహిస్తున్నా: హరీశ్‌రావు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు