Pawan Kalyan: కొండగట్టులో ‘వారాహి’కి పవన్‌ పూజలు.. భారీగా తరలివచ్చిన అభిమానులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిచారు.

Updated : 24 Jan 2023 15:13 IST

కొండగట్టు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిచారు. అనంతరం తన ప్రచార రథం ‘వారాహి’కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించిన తర్వాత దాన్ని ఆయన ప్రారంభించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయన్ను సత్కరించారు. అభిమానులకు ఓపెన్‌టాప్‌ వాహనం నుంచి పవన్‌ అభివాదం చేశారు. 

సాయంత్రం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో జనసేన అధినేత సమావేశమవుతారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచే అనుష్టుప్‌ నారసింహ యాత్రకు పవన్‌ శ్రీకారం చుడతారు. దీనిలో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించనున్నారు. ధర్మపురిలో దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు