IND vs AUS: భారత పర్యటనకు కాఫీ బ్యాగులతో లబుషేన్.. డేవిడ్ వార్నర్ ఆసక్తికర ప్రశ్న
ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ భారత్‌కు కాఫీ ప్యాకెట్లను తీసుకొస్తున్నాడు. కాఫీ ప్యాకెట్లతో నిండిన బ్యాగు ఫొటోను అతడు ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ భారత్‌కు కాఫీ ప్యాకెట్లను తన వెంట తీసుకొస్తున్నాడు. దీనికి సంబంధించి కాఫీ ప్యాకెట్లతో నిండిన బ్యాగు ఫొటోను అతడు ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. పోస్టు చూసిన ఆటగాళ్లు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీనికి తోడు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అడిగిన ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ కాఫీని అమితంగా ఇష్టపడతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే కాఫీ లేనిదే అతడికి ఒక్క రోజు కూడా గడవదు. రోజుకు 10 కప్పులకు పైగా కాఫీ తాగుతాడని ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెహమాన్ తెలిపాడు. ఫిబ్రవరి 9న భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభమవనుంది. దీంతో అతడు కాఫీ ప్యాకెట్లను తన వెంట తెచ్చుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను అతడు ట్విటర్‌లో పోస్టు చేయడంతో డేవిడ్ వార్నర్ ఓ ప్రశ్న స్పందించాడు. ‘కాఫీ ప్యాకెట్లకు దిగుమతి సుంకం చెల్లిస్తున్నావా?’ అని వార్నర్ అడిగాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక భారత బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం లబుషేన్ పోస్టుపై స్పందించాడు. ‘మీకు భారత్‌లోనూ గొప్ప కాఫీ దొరుకుతుంది’ అని ట్వీట్ చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Palnadu: పోస్టుమార్టానికీ లంచం !.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
-
Movies News
Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. సాయం చేస్తామన్న ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి
-
General News
TS High court: ప్రశ్నప్రతాల లీకేజీ కేసు.. సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటి?: హైకోర్టు
-
India News
Supreme Court: ‘ఉబర్.. ర్యాపిడో’పై మీరేమంటారు? కేంద్రాన్ని అభిప్రాయమడిగిన సుప్రీం!
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత్ తొలి ఇన్నింగ్స్ 296/10
-
General News
Mancherial: సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్