ఈ 7 గంటలు మీవే కావాలి..

అమోల్
చక్‌దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్‌ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్‌కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. భారత క్రికెట్ జట్టు కోచ్ అమోల్ మజుందార్ కూడా కబీర్ పాత్రనే పోషించాడు. దక్షిణాఫ్రికాతో ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు అతడు మాట్లాడిన మాటలు అమ్మాయిల్లో ఎంతో స్ఫూర్తి నింపాయి. ‘‘రాబోయే ఏడు గంటలు చాలా కీలకం. ఎవరితో మాట్లాడొద్దు.. ఏదీ పట్టించుకోవద్దు. కప్పే మన లక్ష్యం కావాలి. ప్రతి అడుగు ఆ దిశగానే పడాలి. మన కథను మనమే రాసుకోవాలి. చరిత్ర సృష్టించాలి’’ అని మజుందార్ జట్టుతో అన్నాడు. ‘‘మన అమ్మాయిలను చూసి ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఈ విజయాన్ని ఇంకా నమ్మలేపోతున్నా. వారి కఠోరశ్రమ ఫలించింది’’ అని మజుందార్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ నెగ్గిన తర్వాత కెప్టెన్ రోహిత్ వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ మైదానంలో జెండా పాతినట్లే.. మజుందార్ ముంబయిలో జెండా పాతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


