Mohammed Shami: ‘కూతుర్ని పట్టించుకోవట్లేదు’.. షమీపై హసీన్ తీవ్ర ఆరోపణలు

ఇంటర్నెట్ డెస్క్: భారత పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami)పై అతడి నుంచి విడిగా ఉంటోన్న భార్య హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె ఐరాను మంచి స్కూల్‌లో చేర్పించడం అతడికి ఇష్టం లేదంటూ విరుచుకుపడ్డారు. అయితే, ఐరాకు ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీటు వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. షమీ తన గర్ల్‌ఫ్రెండ్స్ పిల్లలకు ప్రాధాన్యత ఇస్తాడని, వారికి ఖరీదైన బహుమతుల్ని ఇచ్చాడంటూ తీవ్ర పదజాలంతో ఆమె ఆరోపణలు గుప్పించారు. ఐరాను మాత్రం పూర్తిగా విస్మరించాడని, కనీసం స్కూల్ చదువుకు కూడా డబ్బులు చెల్లించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐరా తండ్రి (షమీ) బిలియనీర్ అయినప్పటికీ తన ఉంపుడుగత్తెల పిల్లలను ఉన్నత పాఠశాలల్లో చదివేందుకు సహకరిస్తున్నాడని.. కూతురి చదువుకు మాత్రం డబ్బులేదని చెబుతున్నాడన్నారు. కొందరికి బిజినెస్ క్లాస్ విమానాల్లో ప్రయాణానికి రూ.లక్షలు ఖర్చు చేస్తాడు గానీ.. తన కూతురికి మాత్రం ఏమీ చేయట్లేదని ఆరోపించారు. షమీ నుంచి విడిగా ఉంటోన్న భార్య, కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ.4లక్షలు చొప్పున భరణం కింద చెల్లించాలని షమీకి కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ. 1.5 లక్షలు భార్య హసీన్ జహాన్ కోసం, రూ.2.5 లక్షలు కుమార్తె కోసం వెచ్చించేందుకు చెల్లించాలని పేర్కొంది. షమీ, హసీన్‌కు 2014లో వివాహం జరగ్గా.. 2015లో ఐరా పుట్టింది. 2018లో షమీపై హసీన్ గృహ హింస ఆరోపణలు చేసి కోర్టు మెట్లక్కి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


