Asia Cup 2025: యూఏఈతో పాక్‌ మ్యాచ్‌.. గంట ఆలస్యంగా ప్రారంభం

Eenadu icon
By Sports News Team Published : 17 Sep 2025 19:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌ (Asia Cup)లో భాగంగా షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 8.00 గంటలకు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌, యూఏఈతో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌ గంట ఆలస్యంగా రాత్రి 9.00 గంటలకు ప్రారంభం కానుంది. యూఏఈ మ్యాచ్‌కు గైర్హాజరు అయ్యే యోచనలో ఉన్న పాక్‌ జట్టు పీసీబీ చీఫ్‌ నఖ్వీతో వరుస మంతనాలు జరిపింది. ఆఖరికి ఆయన ఆడమని ఆదేశించడంతో జట్టు మ్యాచ్‌కి సిద్ధమైంది.

టీమ్‌ఇండియాతో (Team India) సెప్టెంబర్‌ 14న పాకిస్థాన్‌ తలపడింది. మ్యాచ్‌ అనంతరం భారత క్రికెటర్లు పాకిస్థాన్‌ ఆటగాళ్లతో కరచాలనానికి అంగీకరించలేదు. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో తాము ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (surya kumar yadav) తెలిపాడు. అయితే టీమ్‌ఇండియా ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడానికి మ్యాచ్‌ రిఫరీ ఆండీ పై క్రాఫ్టే కారణమని ఆరోపిస్తూ పాకిస్థాన్‌ తన నిరసన వ్యక్తం చేస్తోంది.  మేరకు అతడిని ఆసియా కప్‌ నుంచి తొలగించాలని పాకిస్థాన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు ఐసీసీకి లేఖ కూడా రాసింది. అయితే ఐసీసీ పాకిస్థాన్‌ డిమాండ్‌ను పక్కనపెట్టేసింది.

అయితే పాకిస్థాన్‌, యూఏఈ మ్యాచ్‌కు కూడా ఆండీ పై క్రాఫ్టే రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు రెండోసారి కూడా ఐసీసీకి మెయిల్‌ పంపినట్లు తెలుస్తోంది. ఐసీసీ నుంచి ఏ విధమైన స్పందనా రాలేదని సమాచారం. దీంతో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలనే యోచనలో పాక్‌ ఉన్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే పాకిస్థాన్‌ ఆటగాళ్లు మైదానానికి ఆలస్యంగా చేరుకుంటున్న నేపథ్యంలో ఓ గంట ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు