Mohsin Khan: భార్య విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు: మోసిన్‌ ఖాన్‌

బాలీవుడ్‌ నటి రీనారాయ్‌ని వివాహం చేసుకోవడం వల్ల తానేం బాధపడలేదని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ మోసిన్‌ ఖాన్‌ అన్నాడు.

Published : 18 Mar 2023 01:52 IST

(ఫొటో సోర్స్‌: ట్విటర్)

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి రీనారాయ్‌ని వివాహం చేసుకోవడం వల్ల తానేం బాధపడలేదని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ మోసిన్‌ ఖాన్‌ అన్నాడు. అతడు రీనారాయ్‌ని 1983లో వివాహం చేసుకున్నాడు. తర్వాత కొన్నేళ్లకే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కూతురు ‘సనమ్‌’ ఉంది. ఓ ఇంటర్వ్యూలో అతడిని ‘రీనారాయ్‌ని పెళ్లిచేసుకొని మీరేమైనా బాధపడ్డారా?’ అని అడగ్గా.. ‘‘నేనేం బాధపడలేదు. నేను ఓ మనిషినే పెళ్లాడాను. తనెవరు? ఎక్కడ నుంచి వచ్చింది?  ఇవన్నీ నేను ఆలోచించను. నేను పాకిస్థాన్‌లో ఉండాలనే నిర్ణయించుకున్నాను. ఇంగ్లాండ్‌కు వెళ్లి ఆడినప్పటికీ పాకిస్థాన్‌లో ఉండటానికే ఇష్టపడతాను. మా వివాహానికి ముందు ఆమె సినిమాలేవీ నేను చూడలేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా కానీ ఇది ఎవరూ నమ్మరు.  ఇంట్లో నుంచి బయటికి వచ్చే ముందు ఒకవేళ అమితాబ్‌బచ్చన్‌ సీన్‌ వస్తే కొద్దిసేపు చూస్తాను. అంతేకానీ సినిమాలు చూడను. అందాన్ని చూసి నేనెప్పుడూ ఆకర్షణకు లోనవను. మంచి మనుషులంటే నాకిష్టం’’ అని తెలిపాడు. 

క్రికెట్‌ కాకుండా మోసిన్‌ఖాన్‌.. బట్వారా, ఫతేహ్‌, గునేగార్‌ కౌన్‌, ప్రతీకార్‌, మేడమ్‌ ఎక్స్‌, సాతీ వంటి కొన్ని సినిమాల్లోనూ నటించాడు.  రీనా రాయ్‌ నటిగా తన కెరీర్‌ని 15 ఏళ్ల వయసులో ప్రారంభించింది. తన మొదటి సినిమా జరూరత్‌ 1972లో విడుదలైంది. కాలీచరణ్‌, విశ్వనాథ్‌, అప్నాపన్‌, నాగిన్‌, జాఖ్‌మీ, జానీ దుశ్‌మన్‌, ఆశా, అర్పన్‌, ఆశాజ్యోతి, నసీబ్‌, సనమ్‌ తేరీ కసమ్‌ వంటి తదితర చిత్రాల్లో కథానాయికగా నటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని