Sarfaraz - Surya: సూర్య కూడా అలాగే ఉన్నాడు.. సర్ఫరాజ్ కీలక వ్యాఖ్యలు
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan).. ఇటీవల కాలంలో వీరిద్దరి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికపై కామెంట్ల వర్షం కురుస్తోంది. తాజాగా సూర్యకుమార్‌ను ఎంపిక చేయడంపై సర్ఫరాజ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల రంజీ ట్రోఫీలో సెంచరీలతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక అవుతాడని చాలా ఆశపడ్డాడు. కానీ అతడికి జట్టులో స్థానం దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో టీమ్ ఎంపికపై తీవ్ర విమర్శలు రేగాయి. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కమిటీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశాడు. కేవలం సన్నగా ఉంటేనే ఎంపిక చేస్తారా..? అంటూ ప్రశ్నించాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్‌కు బదులు సూర్యకుమార్ యాదవ్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్ ఎంపికపై కూడానూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన సర్ఫరాజ్‌ను కాదని సూర్యను తీసుకోవడం సరైంది కాదని చర్చకు తెరతీశారు. ఈ క్రమంలో సూర్యపై సర్ఫరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరూ ముంబయి తరఫున చాలా మ్యాచుల్లో కలిసి ఆడారు.
‘‘సూర్య ఎంతో మందికి స్ఫూర్తివంతమైన ఆటగాడు. నాకు ఎంతో మంచి స్నేహితుడు. ఒకే జట్టు తరఫున ఆడినప్పుడు చాలా సమయం మేమిద్దరం కలిసిమెలిసి తిరిగాం. అతడి నుంచి చాలా నేర్చుకొన్నా. సూర్య కూడా జట్టులో స్థానం కోసం చాలాకాలం నుంచి వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తన అనుభవం మొత్తం వినియోగించుకొని అదరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు నా దృష్టంతా కష్టపడటం మీదనే ఉంది. సాధ్యమైనంత కష్టపడి ఎప్పటికైనా ఫలితం రాబట్టొచ్చనే నమ్మకం ఉంది. నేను ఎప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లినా సరే.. గత కొన్నేళ్లుగా ఎలా రాణిస్తున్నానో అలానే ఆడతా. మైదానంతో నా అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. అందుకే ఎక్కువగా సాధన చేసి ఫామ్‌ను కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా’’ అని సర్ఫరాజ్ తెలిపాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: లోక్‌సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్‌పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు