
PM Modi meets Olympions: ఒలింపిక్ హీరోలతో మర్చిపోలేని రోజు.. ప్రధాని వీడియో వైరల్
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 16న ఒలింపిక్స్ క్రీడాకారులతో మాట్లాడారు. తన నివాసంలో వారికి ఆతిథ్యం ఇచ్చారు. క్రీడాకారులను ఆత్మీయంగా పలకరించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా మోదీ ట్వీట్ చేశారు. ‘మన ఒలింపిక్స్ హీరోలతో మర్చిపోలేని రోజు’ అని వ్యాఖ్యను జతచేశారు.
పతకం గెలిచి వచ్చాక సింధుకు ఐస్‌క్రీం తినిపిస్తానని పీఎం మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్టే ఆయన ఆమెకు ఐస్‌క్రీం తినిపించారు. ఇక స్వర్ణ పతక విజేత, బల్లెం వీరుడు నీరజ్ చోప్రాతో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. అతడికి చుర్మా తినిపించారు. పురుషులు, మహిళల హాకీ జట్లతో ఆత్మీయంగా గడిపారు. రజత పతక విజేత మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా, మేరీకోమ్‌తో పలు విషయాలు పంచుకున్నారు.
ముఖ్యంగా ఆటగాళ్ల కష్టసుఖాలు, అనుభవాలు, ఫిట్‌నెస్, ఆరోగ్యం, ప్రేరణ, క్రీడల అభివృద్ధికి సూచనలను మోదీ తెలుసుకున్నారు. ఆయన సైతం తన అనుభవాలను వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఆ వీడియో మీ కోసం..!