WPL 2023: వచ్చే ఏడాది నేనూ సెలెక్షన్‌కు వెళ్తా.. అయితే: బాలీవుడ్ నటి
మహిళా క్రికెట్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) జరుగుతుండటంతో సంపాదన కూడా వస్తోంది. దీంతో క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకోవడానికి అమ్మాయిలకు అవకాశం కల్పిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా మహిళా క్రికెట్ (Cricket) ఫీవర్.. తొలిసారి బీసీసీఐ ఆధ్వర్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) జరుగుతోంది. దీంతో కొత్తతరం చిన్నారులు క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకోవడానికి ఈ లీగ్ అక్కరకొస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. సంపాదనతోపాటు క్రేజ్‌ను ప్లేయర్లు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లతో ఆడటం వల్ల స్థానిక ప్లేయర్లకు తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది. అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవడానికి ముందుకు వస్తారు. అయితే, తాజాగా ఓ బాలీవుడ్ నటి కూడా వచ్చే ఏడాది డబ్ల్యూపీఎల్ సెలెక్షన్‌కు వెళ్తానని చెప్పింది. అయితే, ఇదేదో కేవలం మాటలతోనే కాకుండా.. ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం విశేషం. కానీ, ఇక్కడ చిన్న కండీషన్ పెట్టిందండోయ్.. ఇంతకీ ఆమె ఎవరంటే..?
బాలీవుడ్ నటి సైయామి ఖెర్ (Saiyami Kher).. తెలుగులోనూ సాయిధరమ్ తేజ్ తొలి సినిమా ‘రేయ్’ (Rey) హీరోయిన్. నాగార్జునతో వైల్డ్ డాగ్ చిత్రంలోనూ నటించింది. హిందీ, మరాఠీ భాషల్లోనూ సినిమాలు చేసింది. తాజాగా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ‘‘పాఠశాల స్థాయిలో క్రికెట్ తప్ప ప్రతి గేమ్‌ను ఆడేదాన్ని. ఇప్పుడు 11 మందిని జట్టుగా కూడగట్టుకొని ఆడటం, మహిళల ప్రీమియర్ లీగ్ చూడటం ఆనందంగా ఉంది. నా చిన్ననాటి కలను నిజం చేసుకొనేందుకు.. ఎలాంటి షూటింగ్‌లు లేకపోతే వచ్చే ఏడాది డబ్ల్యూపీఎల్ సెలెక్షన్ కోసం వెళ్తా’’ అని పోస్టు పెట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు
-
Politics News
JP Nadda: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయం.. అభివృద్ధే మా ధ్యేయం: జేపీ నడ్డా
-
General News
Polavaram: ఎప్పటికైనా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే: తెదేపా నేతలు
-
India News
Helicopter ride: చదువుల్లో మెరిసి.. హెలికాప్టర్లో విహారంతో మురిసిన విద్యార్థులు!
-
India News
Odisha Train Tragedy: బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌కు ‘సీబీఐ’ సీల్.. అప్పటివరకు రైళ్లు ఆగవు!
-
Politics News
Kiran Kumar Reddy: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే: కిరణ్‌కుమార్‌రెడ్డి