YouTube: యూట్యూబ్‌లో హైడ్

యూట్యూబ్‌లో సినిమా చూస్తుంటాం. క్లైమాక్స్ రసవత్తరంగా సాగుతుంటుంది. ఇంకాసేపట్లో శుభం కార్డు పడుతోందనగా కొన్ని పాపప్‌లు ప్రత్యమవుతుంటాయి. ఆ సినిమాకో, వీడియోకో సంబంధించిన వాటిని.. క్రియేటర్లు ఇతర వీడియోలను ప్రమోట్ చేసుకోవటానికివి తోడ్పడుతుండొచ్చు. కానీ చూసేవారికి మాత్రం చివరి భాగాన్ని ఆస్వాదించటంలో పంటి కింద రాయిలా తగులుతుంటాయి. ఇలాంటి పాపప్ ఎండ్ స్క్రీన్స్ బెడదను తగ్గించటానికి యూట్యూబ్ కొత్తగా హైడ్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.
వీడియో చివర్లో పాపప్స్ కనిపించగానే పైన ఎడమ మూలకు ఈ బటన్ కనిపిస్తుంది. దీన్ని నొక్కగానే పాపప్స్ అదృశ్యమవుతాయి. అంటే ఒక్క క్లిక్‌తోనే రికమండేషన్లు, ప్లేలిస్ట్ లింకులు, సబ్స్క్రిప్షన్ ప్రాంప్ట్స్ వంటివన్నీ కనిపించకుండా పోతాయన్నమాట. ఈ హైడ్ ఫీచర్ అప్పుడు చూస్తున్న వీడియోకే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనసు మార్చుకొని హైడ్ అయిన వాటిని చూడాలనుకుంటే షో బటన్ మీద తాకితే చాలు.
డెస్క్‌టాప్‌లో మరో మార్పు: డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ చూసేవారి కోసం మరో కొత్త మార్పును తీసుకొచ్చారు. క్రియేటర్ల బ్రాండ్ వాటర్‌మార్కు మీద తాకితే ఇకపై వెంటనే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఓపెన్ కాదు. చానల్‌ను సపోర్టు చేయాలంటే వీడియో కింద ఉండే ప్రామాణిక సబ్‌స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయాల్సిందే. వీడియో చూస్తున్న అనుభూతిని మెరుగుపరచటానికే ఈ మార్పు తీసుకొచ్చామని యూట్యూబ్ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చాటింగ్‌లా బ్రౌజింగ్
ఎం1 చిప్‌తో కూడిన లేదా మ్యాక్ఓఎస్ 14, అంతకన్నా పై స్థాయి మ్యాక్ వాడుతున్నారా? అయితే ఏఐ ఆధారిత డయా బ్రౌజర్‌తో వెబ్ వర్క్‌ను స్మార్ట్‌గా మలచుకోండి. - 
                                    
                                        

చేతి రాతతో దీపావళి ఆహ్వానాలు
దీపావళి పండుగ వస్తోంది. మరి బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలపొద్దూ. ఆహ్వానాలు పలకొద్దూ. నేటి డిజిటల్ యుగంలో ఫోన్ చేతిలో ఉంటే చాలు ఇలా టైప్ చేసి, అలా సందేశాలు, ఆహ్వానాలు సెండ్ చేయటం చిటికెలో పనైపోయింది - 
                                    
                                        

హిస్టరీ క్లియర్
అప్పుడప్పుడూ ఫోన్లోనూ బ్రౌజింగ్ హిస్టరీని శుభ్రంగా క్లియర్ చేసుకోవటం మంచిది. ఆండ్రాయిడ్ ఫోన్‌లోనైతే క్రోమ్ యాప్ ఓపెన్ చేసి, పైన కుడిమూలన నిలువు మూడు చుక్కల మీద తాకి, టైమ్‌ఫ్రేమ్‌ను ఎంచుకోవాలి. - 
                                    
                                        

ఆటోప్లే వీడియో ఆఫ్
ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్.. ఫోన్ చేతిలో ఉంటే చాలు. వీటి యాప్‌లను చూడటం ఒక్కటే పని. చాలామందికి ఇదో దినచర్యలా మారిపోయిందన్నా అతిశయోక్తి కాదు. కాకపోతే మొబైల్ డేటా బిల్లే ఆకాశానికి ఎగబాకుతూ ఉంటుంది. - 
                                    
                                        

వాట్సప్‌లో థ్రెడెడ్ రిప్లయ్స్
వాట్సప్‌లో బోలెడన్ని గ్రూప్‌లు. ఒక గ్రూప్‌లోనే ఎన్నో చర్చలు. మెసేజ్‌లన్నీ వరుసగా పరచుకుంటూ వస్తుంటాయి. ఏదైనా ఒక మెసేజ్‌కు మనం స్పందించినా అది ఆ వరుసలోనే పడిపోతుంది. - 
                                    
                                        

వాట్సాప్ రాత సాయం
కొన్నిసార్లు చిన్న మెసేజ్ రాయాలన్నా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందిని తగ్గించటానికి వాట్సాప్ కొత్తగా ఏఐ ఆధారిత ‘రైటింగ్ హెల్ప్’ అనే టూల్‌ను తీసుకొస్తోంది. - 
                                    
                                        

స్పోటిఫైలో మెసేజింగ్
స్పోటిఫై యాప్ తమ యూజర్ల కోసం ఉచిత మెసేజింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. ఇది స్పోటిఫై మీద తమతో ఇంటరాక్ట్ అయినవారితో చాట్ చేయటానికి, మ్యూజిక్‌ను షేర్ చేయటానికి తోడ్పడుతుంది - 
                                    
                                        

గూగుల్ యాక్టివిటీ తనిఖీ చేశారా?
అప్పడప్పుడూ గూగుల్ ఖాతా యాక్టివిటీని తనిఖీ చేసుకోవటం మంచిది. గూగుల్ ఖాతాకు సైన్ ఇన్ అయ్యి, మై అకౌంట్లోకి వెళ్లి దీన్ని చూసుకోవచ్చు. గత 28 రోజుల్లో మనం ఏయే పరికరాల మీద గూగుల్ ఖాతాను వాడుకున్నామో కనిపిస్తుంది. - 
                                    
                                        

ఆఫీసులో వాట్సప్ వెబా?
ఆఫీసు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వెబ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఇలాంటి పని చేయటం తగదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (మీటీ) బహిరంగ సూచన చేసింది. - 
                                    
                                        

ఫోన్ నిరంతరం ట్రాక్ చేస్తుంటే..
ఫోన్లో లొకేషన్ ఫీచర్‌ను వాడుకునే యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు జీపీఎస్ గుర్తును గమనించే ఉంటారు. దారిని చూపించటానికి, క్యాబ్‌ను బుక్ చేసినప్పుడు అదెక్కడుందో తెలుసు కోవటానికి, దారిని చూపించటానికి బాగానే ఉపయోగపడుతుంది. ఇది మంచిదే కావొచ్చు గానీ నిరంతరం మనల్ని ట్రాక్ చేస్తూనే ఉంటుందనే సంగతి మరవరాదు. - 
                                    
                                        

వాట్సప్ మరింత భద్రంగా
ఏదో పనిలో ఉంటారు. హఠాత్తుగా ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో మిమ్నల్ని విచిత్రమైన పేర్లతో కూడిన గ్రూప్‌లో చేరుస్తారు. ఎవరు అందులో చేర్చారో తెలియదు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మెసేజ్‌లు రావటం మొదలవుతాయి. - 
                                    
                                        

ఐడియా చెబితే చాలు కామిక్ కథ అల్లేస్తుంది!
గూగుల్ తమ జెమినీ యాప్‌లో ఓ సరికొత్త ఫీచర్ జతచేసింది. పేరు స్టోరీబుక్. ఏఐ-జనరేటెడ్ ఆర్ట్, ఆప్షనల్ ఆడియో నరేషన్ సాయంతో యూజర్ల ఆలోచనలను కథలుగా మలచటం దీని ప్రత్యేకత. - 
                                    
                                        

ప్రతి పాస్‌వర్డూ ప్రత్యేకమే
ఆన్లైన్లో ఎన్ని ఖాతాలుంటే అన్నింటికీ ప్రత్యేకమైన, వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవాల్సిందే. వీటిని సెట్ చేసుకోవటం, గుర్తుంచు కోవటం కష్టమైనా సరే. ఒకే పాస్‌వర్డ్‌ను అన్నింటికీ వాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. - 
                                    
                                        

నిమిషంలో ఆందోళన పరార్
బాగా ఆందోళన చెందుతున్నారా? అయితే గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి“breathing exercise” అని టైప్ చేసి ఎంటర్ చేయండి. వెంటనే తెర మీద ఒక నిమిషం గైడ్ వీడియో ప్రత్యక్షమవుతుంది. - 
                                    
                                        

ఏఐకి సొంత భాష అబ్బితే?
కృత్రిమ మేధ (ఏఐ) సొంతంగా తనకంటూ ఒక ప్రైవేట్ భాషను సృష్టించుకుంటుందా? అదే నిజమైతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం దాని భాషను నేర్చుకోవాల్సి ఉంటుందా? అది చెప్పినట్టుగానే వినాల్సి వస్తుందా? ఆశ్చర్యకరంగా, భయం కొల్పేలా ఉన్నా ఇవి నిజమయ్యే రోజులు వచ్చే అవకాశం లేకపోలేదు. - 
                                    
                                        

ఐప్యాడ్ హోంస్క్రీన్ మీద వెబ్సైట్
ఐప్యాడ్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను మాటిమాటికీ చూడాల్సిన అవసరముంటే మంచి చిట్కా ఉంది. సఫారీని ఓపెన్ చేసి, పైన కుడివైపున షేర్ బటన్ మీద తాకాలి. - 
                                    
                                        

వాట్సప్‌లో బుక్‌మార్క్!
ముఖ్యమైన వెబ్ పేజీలను బుక్‌మార్క్ చేసుకోవటం తెలిసిందే. ఇలాగే వాట్సప్‌లోనూ మెసేజ్‌లనూ ‘బుక్‌మార్క్’ చేసుకోవచ్చని తెలుసా? మెసేజ్ మీద వేలితో కాసేపు అదిమి పట్టాలి. - 
                                    
                                        

రూటర్ మొరాయిస్తోందా?
రూటర్ సరిగా పనిచేయనప్పుడు రీస్టార్ట్ చేయటం మంచిది. కాకపోతే దీన్ని సక్రమమైన పద్ధతిలో చేయాలి. ముందు మోడెమ్, రూటర్ రెండింటిని అన్‌ప్లగ్ చేయాలి. - 
                                    
                                        

మ్యాక్‌లో టైమ్ ఆదా
మ్యాక్‌లో విండోను మినిమైజ్ చేయటానికి ఎల్లో చుక్క మీద క్లిక్ చేస్తున్నారా? మాటిమాటికీ మౌజ్‌తో క్లిక్ చేయటం ఇబ్బందిగా అనిపిస్తోందా? - 
                                    
                                        

కిండిల్‌లో టైమ్
కిండిల్‌లో పుస్తకం చదువుతున్నప్పుడు సమయం మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నారా? 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ఏలూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 


