Chevella Bus Accident: మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం

Eenadu icon
By Telangana News Desk Published : 04 Nov 2025 04:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఘటనా స్థలంలో వివరాలు తెలుసుకుంటున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు 

ఈనాడు, హైదరాబాద్‌ - శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్‌ రాజనర్సింహ, శ్రీధర్‌బాబు అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే వైద్య చికిత్సలను చేయిస్తుందన్నారు. మంత్రులు చేవెళ్ల ఆసుపత్రి వద్ద మృతదేహాలను పరిశీలించి.. క్షతగాత్రులను పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, రవాణా శాఖ అధికారులతో జూమ్‌ సమావేశంలోనూ పొన్నం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ఇస్తామన్నారు. ఇవి కాకుండా వాహన బీమా పాలసీ ద్వారా బాధితులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మంత్రి పొన్నం మంగళవారమే చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు పొన్నం తెలిపారు. మృతుల అంత్యక్రియల విషయమై ఒక్కో అధికారిని నియమించి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామమన్నారు. క్షతగాత్రుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి దామోదర్‌ రాజనరసింహ తెలిపారు. 

ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. క్షతగాత్రులు ఎక్కడ చికిత్స చేయించుకున్నా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందన్నారు.

గాయపడిన వారిని పరామర్శిస్తూ వైద్యులతో మాట్లాడుతున్న మంత్రి దామోదర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు