Revanth Reddy: ఛాన్స్‌ వస్తే మన కోసం కష్టపడే వ్యక్తినే నెగ్గించుకోవాలి: రేవంత్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Team Published : 31 Oct 2025 21:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెహమత్‌ నగర్‌లోని పీజేఆర్‌ విగ్రహం వద్ద నుంచి సీఎం రోడ్‌షోలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘‘రాజకీయల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. అవకాశం అందరికీ అన్నిసార్లు రాకపోవచ్చు. అవకాశం వస్తే మన కోసం కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోవాలి. అలా చేయకపోతే చారిత్రక తప్పిదమే. సెంటిమెంట్‌ పేరుతో ఆశీర్వదించాలని భారత రాష్ట్రసమితి ముందుకొచ్చింది. పీజేఆర్‌ అకాల మరణం చెందితే ఆనాడు ఎన్నిక ఏకగ్రీవం చేశారు. ఆనాడు పీజేఆర్‌ గౌరవార్థం రాజకీయ వైరుధ్యాన్ని చంద్రబాబు పక్కనపెట్టారు. ఆనాడు ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి చంద్రబాబు సహకరించారు. కానీ, పీజేఆర్‌ కుటుంబంపై పోటీకి భారత రాష్ట్రసమితి అభ్యర్థిని నిలబెట్టింది. దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది భారత రాష్ట్రసమితి నేతలు కాదా..?’’ అని రేవంత్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు