panchayat elections: కాంగ్రెస్.. అదే జోష్
రెండో విడతలోనూ సగానికి పైగా సర్పంచి స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారుల విజయభేరి
27 జిల్లాల్లో మెజార్టీ సీట్లు ‘హస్త’గతం
గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి
నిర్మల్ జిల్లాలో భాజపాకుఅత్యధిక స్థానాలు
అర్ధరాత్రి 12.30 గంటల వరకు అందిన ఫలితాలివీ..
85.86% పోలింగ్ నమోదు

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఓటు వేయటానికి చంటిబిడ్డలతో వస్తున్న మహిళలు
ఈనాడు,హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. భాజపా మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. అర్ధరాత్రి 12.30 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2,297 (51.9%), భారత రాష్ట్ర సమితి 1,191 (27.5%), భాజపా 257 (6.2%), ఇతరులు 578(14.4%) పొందారు. వీరిలో సీపీఎం మద్దతుదారులు 33 చోట్ల, సీపీఐ బలపరిచినవారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2,425 చోట్ల, భారత రాష్ట్ర సమితి 1,168, భాజపా 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందారు.

మండలాల వారీగా రెండో దశ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఓటెత్తిన పల్లెలు
వణికించే చలిలోనూ ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఉదయం నుంచే బారులు తీరారు. 85.86 శాతం పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన(84.28%) పోలింగ్ కన్నా ఇది 1.58 శాతం ఎక్కువ. ఆదివారం సెలవురోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో రెండు గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్యులకు పోటీపడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్ నమోదైంది.

నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో ఓటు వేసిన గోలి వెంకటమ్మ (96)
నిజామాబాద్‌లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటు వేయగా వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళా ఓటర్లలో 23,93,010.. పురుష ఓటర్లు 26,57,702లో 22,77,902 మంది.. ఇతరుల్లో 143కు 60 మంది ఓట్లు వేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. 1 గంటకు పోలింగు ముగియగా... మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. పోటీ హోరాహోరీగా జరగడంతో చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. పలు చోట్ల ఒకటి, రెండు.. ఇలా తక్కువ మెజార్టీతోనూ చాలా మంది విజయం సాధించారు. ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచి ఎన్నికలను అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యులను సమావేశపరిచి ఉపసర్పంచులను ఎన్నుకున్నారు.
27 జిల్లాల్లో కాంగ్రెస్
నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు ,మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలిచారు.
మూడు జిల్లాల్లో భారత రాష్ట్ర సమితి
సిద్దిపేట, కుమురంభీం, జనగామలలో భారత రాష్ట్ర సమితి మద్దతుదారులు ముందున్నారు.
ఒక జిల్లాలో భాజపా
నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించిన భాజపా మద్దతుదారులు.. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ తర్వాత నిలిచారు.

సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో చుట్టూ రేకులు కట్టి, పైకప్పు లేకుండా పరదాలతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఓటర్లు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాళ్లు విరిగినా.. ఓటు కర్తవ్యంలో

సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లికి చెందిన బోనాల లక్ష్మి ఇటీవల రోడ్డుప్రమాదంలో రెండు కాళ్లు విరిగి చికిత్స పొందుతుండగా.. ఆదివారం పోలింగ్ కేంద్రానికి ఆటోలో వచ్చారిలా..
రెండు ఓట్లు.. మూడు చుక్కలు

సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన మైసాని నర్సింలుకు కంటిచూపు లేకపోవడంతో పోలింగ్‌బూత్‌కు ఆయన భార్య మల్లవ్వతో వెళ్లి ఆమె ద్వారా తాను కోరుకున్న గుర్తుకు ఓటు వేశారు. తరువాత మల్లవ్వ కూడా ఓటు వేయగా.. దీనితోపాటు భర్తకు సాయం చేసినందుకు కలిపి పోలింగ్ సిబ్బంది ఆమె రెండు వేళ్లకు సిరా చుక్కలు వేశారు.
ఈనాడు, సిద్దిపేట
నేనున్నాననీ..

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన రాములమ్మ అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండటంతో అక్కడే ఉన్న ఎస్సై తిరుపాజీ ఆమెను ఇలా ఎత్తుకొని తీసుకెళ్లారు.
వీలుచేసుకొని వీల్‌చైర్‌లో..

వనపర్తి మండలం మెంటెపల్లి గ్రామంలో ఓటు వేయడానికి వీల్‌చైర్‌లో వచ్చిన 104 ఏళ్ల మాణిక్యమ్మ

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

అడవిలో పులి లెక్క.. ఈ రెడ్డయ్య కుటుంబం
అడవిలో పులి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. దానికంటూ సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటుంది. తన జతను తప్ప మరో పులిని అందులోకి రానివ్వదు. -

బ్యాలెట్ బాక్సులేనా.. బనానా బాక్సుల్లేవా..
ఖమ్మం జిల్లాలో అతిపెద్ద పంచాయతీ అయిన తల్లాడలో 6,500 మంది ఓటేసేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బారులుతీరారు. -

మనసుకు బాధ కలిగి.. శుభ్రం చేసిన మొగులయ్య
ప్రముఖ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య వర్ణచిత్రాన్ని ప్రభుత్వం హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద మెట్రో పిల్లర్‌పై గీయించింది. -

4 ఓట్లతో ఓడి.. 6 తేడాతో గెలిచి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థుల్లో ఒకరు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన అనంతరం రీకౌంటింగ్‌లో ఫలితం మారిపోయింది. -

కాంగ్రెస్.. ‘తీన్’మార్
రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. -

ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత పిటిషన్ల కొట్టివేత
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఆయన.. -

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బుధవారం స్పీకర్ ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ ఒక ప్రకటనలో స్పందించారు. -

ఏప్రిల్ నుంచి ‘కొత్త డిస్కం’
తెలంగాణలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -

ప్రారంభానికి సిద్ధంగా క్రిటికల్ కేర్ విభాగాలు
రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రులకు అనుసంధానంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాకుల్లో 8 భవనాలు మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ‘గోల్డెన్ అవర్’లో మెరుగైన చికిత్స అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ యూనిట్లను నిర్మించింది. -

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గ్రామంలో భాజపా మద్దతుదారు గెలుపు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో భాజపా మద్దతుదారు గానుగపాట అంజమ్మ సర్పంచిగా గెలుపొందారు. ఈ గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. -

అదృష్టవంతులు.. ఈ సర్పంచులు
పల్లె పోరులో కొందరు సర్పంచి అభ్యర్థులను అదృష్టం వరించింది. బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో పలు చోట్ల ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా రాగా అధికారులు లక్కీ డ్రా తీశారు. -

ఒక్క ఓటుతో గెలుపు తలుపు తట్టి..
హోరాహోరీగా జరిగిన పల్లె సంగ్రామంలో ఒక్క ఓటు కొందరి తలరాతలు మార్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటింది. -

ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురై ఎంపీడీవో మృతి
ఎన్నికల విధుల్లో ఒత్తిడికి లోనైన ఎంపీడీవో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. కార్యాలయ ఉద్యోగులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. -

వామపక్షాలకు మిశ్రమ ఫలితాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వామపక్షాలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సీపీఎం మద్దతుదారులు గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 120 మందికిపైగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. -

గతం కన్నా పెరిగిన భాజపా బలం
గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని గతంలో కన్నా పెంచుకుంది. మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచిన స్థానాల సంఖ్య 700 దాటింది. -

భారత రాష్ట్ర సమితికి నూతనోత్సాహం
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు భారాసకు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణులు నిరాశగా ఉన్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆనందాన్ని కలిగించింది. -

చేయి పట్టుకున్న పల్లె..!
పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణుల మద్దతు లభించిందని కాంగ్రెస్ వర్గాల్లో జోష్ పెరిగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పార్టీకి ఇప్పుడు ప్రజల మద్దతు మరింత పెరిగినందునే అత్యధిక స్థానాలు నెగ్గినట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు. -

కాంగ్రెస్ పతనం ప్రారంభం
రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -

మా పాలనపై విశ్వాసానికి ఈ ఫలితాలే ప్రతిబింబం
అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘనవిజయం సాధించడం గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై వ్యక్తం చేసిన విశ్వాసానికి ప్రతిబింబమని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. -

మంచి పేరు తెచ్చుకోండి.. నాకూ కొంత పంచండి
‘ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు.. నిత్యం వారి కోసం పనిచేయండి.. గ్రామాలను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుని అందులో నాకూ కొంత పంచండి’ అంటూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితబోధ చేశారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్ట్
-

ప్రియుడిపై కేసు.. మనస్తాపంతో ప్రియురాలి ఆత్మహత్య
-

‘టారిఫ్’.. ఈ పదమంటే నాకెంతో ఇష్టం: డొనాల్డ్ ట్రంప్
-

‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ శిల్పి రామ్ సుతార్ కన్నుమూత
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/12/2025)
-

ఎల్ఐసీ భవనంలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి!


