TG News: తెలంగాణలో ప్రైవేటు కాలేజీల బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపు

Eenadu icon
By Telangana News Team Published : 01 Nov 2025 19:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్: ప్రభుత్వం రేపటిలోగా నిర్ణయం తీసుకోకపోతే.. ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌ పాటిస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ రమేష్‌ బాబు తెలిపారు. ఫతేమైదాన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై గత 6 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రస్తుతం రూ.1200 కోట్ల ఇవ్వాలని అడిగాం. మిగిలిన బకాయిల చెల్లింపులపై రోడ్ మ్యాప్‌ రూపొందించాలని కోరాం. కేవలం రూ.300 కోట్లు ఇచ్చారు.. ఇంకా రూ.900 కోట్లు దీపావళికి ఇవ్వాలని అడిగాం. నవంబరు ఒకటి నాటికి పెండింగ్‌ బకాయిలు మొత్తం ఇవ్వాలని కోరాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అందరినీ కలిశాం. అధికారులు మా విజ్ఞప్తిని పెడచెవిన పెట్టారు. మమ్మల్ని ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోంది. మా మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వృత్తి విద్యా కాలేజీలు నవంబర్‌ 3 నుంచి నిరవధిక బంద్‌ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. రేపటిలోగా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. బంద్ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలి. 

నవంబర్ 6న అన్ని కాలేజీల స్టాఫ్, సిబ్బందితో కలిసి దాదాపు లక్ష మందితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తాం. నవంబర్ 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. ఒకటి.. రెండు కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించారు. 10శాతం లంచం తీసుకొని ఇచ్చారా. ఆ కాలేజీలపై విచారణ జరపాలి. అత్యంత ఫ్రాడ్ జరిగే దగ్గర విచారణ జరపాలి. ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్ల ముట్టడి చేస్తాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాం’’ అని రమేష్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు