రిజర్వేషన్లపై తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలపై మాట్లాడాలి!
మంత్రి పొంగులేటికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచన
ఈనాడు, హైదరాబాద్: రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే స్థానిక ఎన్నికల నిర్వహణపై మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని మంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ మంత్రితో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించినట్లు సమాచారం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీతో ముందుగా సంప్రదించకుండా ఎన్నికలపై ప్రకటనలు చేయవద్దని మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రికి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 - 
                        
                            

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్‌లు.. వ్యాపారి గిఫ్ట్
 


