పక్షం రోజుల్లో సమస్యలను పరిష్కరించాలి

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

లేదంటే 20న మహాధర్నా
రాష్ట్ర చేనేత కార్మిక సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణమాఫీ, ఇతర సమస్యలను పక్షం రోజుల్లో పరిష్కరించాలని.. లేదంటే వచ్చే నెల 20న మహాధర్నా చేపడతామని తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఏడాదిన్నర దాటిందని.. ఇకనైనా అమలు చేయాలన్నారు. చేనేత సంఘాలకు 12 ఏళ్లుగా ఎన్నికలు లేవని పేర్కొన్నారు. చేనేత భరోసా, రూ.5 లక్షల వరకు ఆరోగ్యబీమా ఇతర పథకాలు అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా వచ్చే నెల 20న చేనేత కమిషనర్‌ కార్యాలయం ముందు మహాధర్నా చేస్తామన్నారు. దీనికి అన్ని చేనేత సంఘాలను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, ఇతర నేతలు మురళీధర్, శంకరయ్య, నరహరి, ఉపేందర్, చంద్రశేఖర్, శేఖరయ్య, వెంకటేశం, శ్రీశైలం పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని