‘317 జీఓ’ ఉపాధ్యాయ బదిలీ దరఖాస్తులు 6,500
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 317 జీఓ ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయుల నుంచి తాత్కాలిక బదిలీ(డిప్యుటేషన్) కోసం సుమారు 6,500 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 26తో ముగిసింది. దరఖాస్తులను ఆయా డీఈఓలు పరిశీలిస్తే చివరకు అర్హత కలిగిన దరఖాస్తుల సంఖ్య 3 వేల నుంచి 4 వేలకు మించకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. బదిలీల్లో స్పౌజ్, పరస్పర తదితర కేటగిరీల కింద లబ్ధిపొందిన వారు, 2021లో 317 జీఓ జారీ చేసిన అనంతరం పదోన్నతులు పొందిన వారు తాత్కాలిక బదిలీకి అనర్హులు. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఉమ్మడి జిల్లాలో కోరుకున్న జిల్లా పరిధిలో ఖాళీల ఆధారంగా తాత్కాలిక బదిలీకి ఆదేశాలు జారీ చేయనున్నారు. గరిష్ఠంగా మూడేళ్లపాటే బదిలీ చేస్తారు. ఒకసారి మాత్రమే ఈ వెసులుబాటును వినియోగించుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అబుధాబి లక్కీ డ్రాలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


