‘శ్రీరామనవమి’పై స్పష్టత వస్తేనే ‘పది’ పరీక్షల షెడ్యూల్‌!

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల పూర్తి స్థాయి షెడ్యూల్‌ జారీకి కొత్త సమస్య వచ్చింది. పాఠశాల విద్యా క్యాలెండర్‌లో వచ్చే మార్చి 26వ తేదీన శ్రీరామ నవమి అని పేర్కొన్నారు. తితిదే క్యాలెండర్‌లో మాత్రం మార్చి 27వ తేదీన అని ముద్రించారు. ఈ క్రమంలో పండగ ఎప్పుడన్నది స్పష్టత వస్తేనే పదో తరగతి పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించడానికి వీలవుతుంది. ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరుగుతాయని ఇటీవల బోర్డు స్పష్టం చేసింది. అంటే పదో తరగతి పరీక్షలను మార్చి 16 లేదా 17వ తేదీ నుంచి మొదలు పెట్టేందుకు అవకాశముంది. శ్రీరామ నవమి ఎన్నడన్నది స్పష్టత వస్తే ఆ రోజు పరీక్ష లేకుండా తేదీలను ఖరారు చేయవచ్చు. దీనిపై స్పష్టతనివ్వాలని విద్యాశాఖ అధికారులు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి లేఖ రాసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు