భాజపా గుప్పిట్లో రాజ్యాంగ వ్యవస్థలు!

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

స్వేచ్ఛగా ఓటేసేలా ఈసీ చర్యలు తీసుకోవాలి
సీపీఎం అగ్రనేత ప్రకాశ్‌ కారాట్‌ డిమాండ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుందని సీపీఎం అగ్రనేత, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారట్‌ ఆరోపించారు. సీపీఎంను రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 23 నుంచి జరుగుతున్న రాజకీయ తరగతుల ముగింపు సమావేశం అనంతరం ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తోందని... ఆరెస్సెస్, భాజపాలపై లౌకిక, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. 12 రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) అమలు చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించి ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలో లౌకిక శక్తులన్నింటినీ ఒక వేదిక మీదకు తేవడం తమ లక్ష్యమని పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం మాజీ ఎంపీ పీకే బిజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు