పది, ఇంటర్‌ బోర్డులను విలీనం చేయాలి!

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 03:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఆరు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్‌కు ప్రత్యేక బోర్డులున్నాయని..రెండు బోర్డులను విలీనం చేసి ఒకటే బోర్డుగా చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ కోరారు. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పాఠశాల విద్యా బోర్డుల మండలి(కాబ్సే) 54వ సమావేశం ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన ‘భవిష్యత్తులో పాఠశాల విద్య’ అనే అంశంపై శుక్రవారం ప్రసంగించారు. తెలంగాణ, ఏపీ సహా కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపుర్‌ రాష్ట్రాల్లో మాత్రమే పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని, వీటివల్ల గందరగోళం ఏర్పడుతోందని, వాటిని విలీనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 66 బోర్డులున్నా 95 శాతం విద్యార్థులు 34-36 బోర్డుల పరిధిలోనే ఉన్నారని చెప్పారు. ఎంతమంది తమ విద్యార్థులు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్‌లో ఉత్తీర్ణులవుతున్నారనేది బోర్డులు తెలుసుకోవాలన్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ..అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని, ఒకటో తరగతి నుంచి తొమ్మిది వరకు ‘ఏఐ’ బోధిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహార పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాబ్సే అధ్యక్షుడు డాక్టర్‌ జి.ఇమ్మానుయేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు