తెలంగాణ పోలీసులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 03:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటెలిజెన్స్‌లో పలువురికి ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్‌’ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసులు పలువురికి కేంద్ర హోంశాఖ నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్‌’ పేరిట ఏటా ప్రకటించే ఈ పురస్కారాలకు తెలంగాణ నుంచి 19 మంది ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి స్పెషల్‌ ఆపరేషన్‌ ఫీల్డ్‌లో ఇద్దరికి, ఇన్వెస్టిగేషన్‌ ఫీల్డ్‌లో ముగ్గురికి, ఇంటెలిజెన్స్‌ ఫీల్డ్‌లో 14 మందికి ఈ పురస్కారాలు లభించాయి. తెలంగాణ ఇంటెలిజెన్స్‌తోపాటు అదే విభాగంలో అంతర్భాగమైన సీఐ సెల్, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) పోలీసులు వీటికి ఎంపికయ్యారు. 

  • స్పెషల్‌ ఆపరేషన్‌ ఫీల్డ్‌లో సీఐ సెల్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుళ్లు ఎ.లక్ష్మణ్‌రావు (సివిల్‌), జి.జాకబ్‌ (ఏఆర్‌) ఉగ్రవాద నిరోధక చర్యలకు సంబంధించి ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి క్షేత్రస్థాయి ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యలను భగ్నం చేయడంలో కీలకంగా వ్యవహరించినందుకు వీరికి పురస్కారం ప్రకటించారు.
  • ఇన్వెస్టిగేషన్‌ ఫీల్డ్‌లో సీఐ సెల్‌కే చెందిన ఇన్‌స్పెక్టర్‌ వాసాల తిరుపతితోపాటు సివిల్‌ విభాగం ఇన్‌స్పెక్టర్లు చంద్రబాబు నగరి, ఉపేందర్‌రావు జాలా పురస్కారం అందుకోనున్నారు. 
  • ఇంటెలిజెన్స్‌ ఫీల్డ్‌కు సంబంధించి మెయిన్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ ఎం.రవీందర్‌రెడ్డి ఈ పతకానికి ఎంపికయ్యారు. సీఐ సెల్‌కు చెందిన ఎస్సైలు పి.జితేందర్‌ప్రసాద్, కె.శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుళ్లు పి.శ్రీనివాస్‌రెడ్డి, మీర్‌ మెహిదీ అలీ, డి.రామచంద్రారెడ్డి, పి.విక్రమ్, కానిస్టేబుల్‌ గుగ్గిళ్ల రమేశ్‌లను ఎంపిక చేశారు. ఎస్‌ఐబీకి చెందిన ఎస్సై పి.శ్రీధర్, హెడ్‌ కానిస్టేబుళ్లు సీహెచ్‌ లక్ష్మీనారాయణ, బి.అంజయ్య, ఎం.రమేశ్, ఎం.శ్రీనివాస్, ఎస్సై ఎన్‌.గౌతమ్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు