‘చైనా ప్లస్‌ 1’గా రింగురోడ్ల మధ్య ప్రాంతం

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘సీఐఐ సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌’ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: గ్లోబల్‌ ‘చైనా ప్లస్‌ 1’ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ఉండే ప్రాంతాన్ని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ‘డ్రైవింగ్‌ ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ అండ్‌ ఇన్నోవేషన్‌; తెలంగాణ రోడ్‌ మ్యాప్‌ టూ త్రీ ట్రిలియన్‌ డాలర్స్‌ ఎకానమీ’ అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘‘అర్బన్‌ ఇంజిన్, ఇండస్ట్రియల్‌ హార్ట్‌ ల్యాండ్, రూరల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ జోన్‌ అనే 3 మూల స్తంభాలుగా తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. 2035 నాటికి హైదరాబాద్‌ జీడీపీ 350 బిలియన్‌ డాలర్లకు చేరేలా.. సర్వీసెస్, సస్టెయినబిలిటీ, స్మార్ట్‌ లివింగ్‌కు అనుకూలంగా ఉండే.. నెట్‌-జీరో ఫ్యూచర్‌ సిటీగా తీర్చిదిద్దుతాం. ప్రతి రైతును పారిశ్రామికవేత్తగా మార్చేలా అగ్రి-ప్రాసెసింగ్‌ క్లస్టర్లు, డిజిటల్‌-అనుసంధానం కలిగిన ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేస్తాం’’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ సదరన్‌ రీజియన్‌ ఛైర్మన్‌ థామస్‌ జాన్‌ ముత్తూట్, డిప్యూటీ ఛైర్మన్‌ రవి చంద్రన్, సీఐఐ తెలంగాణ కౌన్సిల్‌ ఛైర్మన్‌ శివప్రసాద్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి పాల్గొన్నారు.

తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రండి 

రాష్ట్రంలో తుపాను కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు  మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పౌరులు, రైతుల కోసం సహాయ, పునరావాస శిబిరాలు నిర్వహించాలని పలు సంస్థలకు మంత్రి శుక్రవారం లేఖలు రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని