‘స్థానిక’ ఓటర్ల జాబితాల నవీకరణ
కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లనూ ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. గత నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల 15 వరకు నమోదయ్యే గ్రామీణ ఓటర్లను ‘స్థానిక’ ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాలంది. ప్రస్తుతం ‘స్థానిక’ ఎన్నికలు వాయిదా పడినా... మళ్లీ నిర్వహించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా వాటికోసం ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించి తాజాగా ఆదేశాలిచ్చింది. గ్రామ పంచాయతీ వార్డుల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం శాసనసభ ఓటర్ల జాబితాల్లో ఈ నెల 15 వరకు నమోదయ్యే వారి వివరాలను తమకు డిజిటల్ రూపంలో అందించాలని సీఈవో సుదర్శన్‌రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల లేఖ రాసింది. ఈ జాబితా రాగానే అన్ని జిల్లాలకు పంపి.. వాటి ఆధారంగా అందులోని కొత్త ఓటర్లను పంచాయతీ ఓటర్ల జాబితాలో చేరుస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


