మార్చురీ ఘటనపై విచారణ నివేదిక అందజేత
విధుల నుంచి ఇద్దరి తొలగింపు
ఈనాడు, హైదరాబాద్, మహబూబాబాద్, న్యూస్‌టుడే: మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన ఘటనపై విచారణ పూర్తయింది. ఈ వ్యవహారంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణ కమిటీ సభ్యులు నివేదికను శనివారం డీఎంఈకి అందజేశారు. అనారోగ్యంతో రాజు అనే వ్యక్తి ఇటీవల మహబూబాబాద్ ఆసుపత్రికి రాగా.. అక్కడి వారు క్యాజువాలిటీలో వైద్యం అందించకుండా.. బతికుండగానే మార్చురీలో మంచంపై పడుకోబెట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనపై డీఎంఈ నరేంద్రకుమార్ ముగ్గురు వైద్యులతో విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ సభ్యులు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఘటనకు దారి తీసిన అంశాలను ఆరా తీశారు. ఆసుపత్రి పర్యవేక్షకుడితో పాటు ఇతర వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. బాధితుడి వెంట అటెండెంట్‌లు లేరని చికిత్స చేయకుండా నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలిందని సమాచారం. ఈ ఘటనలో మార్చురీ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేటు ఏజెన్సీ సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను శనివారం విధుల నుంచి తొలగించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో సమీక్ష నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


