అవసరమున్న చోట టీచర్ల సర్దుబాటు
పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: పాఠశాలల్లో అధికంగా టీచర్లు ఉన్నచోట నుంచి అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు ద్వారా పంపాలని, ఆ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ డీఈఓలను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సర్దుబాటు చేసినా కొన్ని పాఠశాలల్లో కొరత ఉందని, అదే సమయంలో అనేక చోట్ల ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు. అందువల్ల అవసరమైన పాఠశాలలకు వారిని తాత్కాలిక బదిలీ చేయాలన్నారు. పలు జిల్లాల్లో సర్దుబాటుకు ఉత్తర్వులిచ్చినా.. అనేక మంది ప్రజాప్రతినిధులతో ఒత్తిడి చేయించి, వాటిని నిలిపివేయించుకున్నారు. ఆ విషయం సంచాలకుడి దృష్టికి రావడంతో మరోసారి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఏడాదికి ఒకసారి సర్దుబాటు చేయడం కాదని.. ఒక ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొందినా, దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా, ఆ స్థానంలో మరో టీచర్‌ను నియమించాలని ఇటీవల డీఈఓలను మౌఖికంగా ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


