హతుల కన్నా రోడ్డుప్రమాద మృతులే పది రెట్లు అధికం: డీజీపీ శివధర్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 04:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య హత్యలకు గురవుతున్న వారి కన్నా పది రెట్లు ఎక్కువగా ఉందని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు త్వరలో రోడ్డుభద్రతపై ‘అరైవ్‌ అలైవ్‌’ అనే కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రత నిపుణులతో శనివారం ఆయన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న జరిగే ప్రపంచ రోడ్డు భద్రత బాధితుల స్మారక దినం సందర్భంగా అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని రూపకల్పన చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రత కోసం ‘అరైవ్‌ అలైవ్‌’ అంశంపై వచ్చే నెలలో 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. ప్రతి డ్రైవర్‌ ‘సేఫ్టీ కనెక్ట్‌’ అనే కృత్రిమమేధ ఆధారిత యాప్‌ను వినియోగించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీజీపీలు మహేశ్‌ భగవత్‌ (శాంతిభద్రతలు), దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ (మల్టీజోన్‌-2), ఐజీపీలు చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, రమేశ్‌నాయుడు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌తో పాటు స్వచ్ఛంద సంస్థల తరఫున తన్మయ్‌ దీక్షిత్‌ (సేఫ్టీ కనెక్ట్‌ వ్యవస్థాపకుడు) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు