ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించకపోవడం దురదృష్టకరం

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 04:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి. చిత్రంలో విశ్వేశ్వర్‌రావు, మురళీ మనోహర్, రామచంద్రమూర్తి, కోదండరాం

బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించకపోవడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో రాష్ట్రసదస్సు నిర్వహించారు. రిజర్వేషన్లు 50% దాటొద్దనే తీర్పులో 1931 బీసీ కులగణన, 1961 జనగణన, 1979 మండల కమిషన్‌ నివేదికలను పరిగణనలోకి తీసుకుని నాటి పరిస్థితుల్లో న్యాయస్థానం ఆ అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. రిజర్వేషన్లు సవరించుకోవచ్చని మండల కమిషన్‌ నివేదికలో స్పష్టంగా ఉందని చెప్పారు. రిజర్వేషన్‌ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ రిజర్వేషన్లకు భాజపా మొదటి నుంచి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధించేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని, డిసెంబరులో హైదరాబాద్‌లో భారీర్యాలీ, జనవరిలో దిల్లీలో దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్‌ మురళీమనోహర్, సీనియర్‌ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, నర్సయ్య, నేతలుపాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు