‘ఆకేరు’ తీరాన అన్నదాత అరిగోస..!

Eenadu icon
By Telangana News Desk Updated : 02 Nov 2025 05:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వంతెన పక్కన తన వరి పొలంలో రాళ్లూరప్పలు చేరాయని చూపుతున్న ఖమ్మం గ్రామీణ మండలం కాచిరాజుగూడెం రైతు నారాయణ

ఆకేరు వాగు అన్నదాతలను వరుసగా రెండో ఏడాదీ అరిగోస పెట్టింది. పంట చేతికొచ్చే సమయానికి వరద నీరు ముంచెత్తటంతో రైతన్నలకు కన్నీరే మిగిలింది. గత నెలాఖరున వచ్చిన మొంథా తుపాను ప్రభావంతో ఆకేరుకు ఎగువ నుంచి ఉద్ధృతంగా వరద నీరు పోటెత్తింది. దీంతో ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల్లో వందల ఎకరాల్లో వరి, పత్తి, మిరప, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతోపాటు అంచుల వెంట ఇసుక మేటలు వేసి రాళ్లూరప్పలు వచ్చి చేరాయి. వ్యవసాయ మోటార్లు పాడయ్యాయి. తిరుమలాయపాలెం మండలంలో హైదర్‌సాయిపేట, రావిచెట్టుతండా, పడమటితండా, తూర్పుతండా, రాకాసితండా, అజ్మీరతండా తదితర గ్రామాల్లో 800 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మరో 400 ఎకరాల్లో ఇతర పంటలు నీటమునిగినట్లు ఏవో సీతారామిరెడ్డి తెలిపారు. ఖమ్మం గ్రామీణం మండలంలో కస్నాతండా, వాల్యాతండా, గూడూరుపాడు, తనకంపాడు, ఊటవాగుతండా, తీర్థాల గ్రామాల్లో 200 ఎకరాల్లో వరి రైతులు నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఖమ్మం గ్రామీణ మండలం వాల్యాతండాలో ముంపు బారిన పడ్డ బెండ తోటలో రైతు ధరావత్‌ వాల్య దంపతులు

ఈనాడు, ఖమ్మం, న్యూస్‌టుడే, తిరుమలాయపాలెం

Tags :
Published : 02 Nov 2025 05:19 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు