తెలంగాణలో 47.6% ఉపాధి హామీ పనిదినాల తగ్గుదల
జాతీయ సగటు తగ్గుదల 10.4 శాతమే
2025-26 తొలి 6 నెలలపై ‘లిబ్‌టెక్’ నివేదిక

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 47.6% పనిదినాలు తగ్గినట్లు లిబ్‌టెక్ ఇండియా అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటు పనిదినాల తగ్గుదల 10.4 శాతమేనని పేర్కొంది. దిల్లీకి చెందిన ప్రముఖ అధ్యయన సంస్థ లిబ్‌టెక్ ఇండియా గత కొన్నేళ్లుగా ఉపాధిహామీ పథకంపై అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు ప్రతీ 6 నెలలకోసారి వివరాలను వెల్లడిస్తోంది. నివేదికలోని ముఖ్యాంశాలివి..
- తెలంగాణలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 25.33 లక్షలు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 19.94 లక్షలకు (21.3%) తగ్గింది. ప్రతీ కుటుంబానికి లభించిన సగటు పనిదినాల సంఖ్య 41 నుంచి 27కి తగ్గింది.
 - సామాజికవర్గాలవారీగా.. ఎస్సీల్లో 48.3%, ఎస్టీల్లో 41.7%, ఇతరుల్లో 49.5% మేర పనిదినాలు తగ్గాయి. జిల్లాలవారీగా అత్యధికంగా మేడ్చల్‌లో 92.8%, జోగులాంబ గద్వాలలో 72.6%, కామారెడ్డిలో 68.7% నిజామాబాద్‌లో 67.1% తగ్గుదల నమోదైంది.
 - 2025-26లో కేంద్ర ప్రభుత్వం రోజువారీ వేతనాన్ని రూ.300 నుంచి రూ.307కి పెంచినప్పటికీ పనిదినాలు తగ్గిపోవడంతో కుటుంబాలు సంపాదించిన మొత్తం ఆదాయం తగ్గింది.
 
ఈకేవైసీతో సమస్యలు..
తెలంగాణలో జాబ్‌కార్డుల పునరుద్ధరణ జరగలేదు. 2022-23లో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం అమలు సమయంలో 5.1 లక్షల మంది జాబ్‌కార్డులు తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అవే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈకేవైసీ విధానం తెచ్చింది. కాగా రాష్ట్రంలో మొత్తం 53 లక్షల మందికి జాబ్‌కార్డులు ఉండగా.. ఇందులో 48.5% మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 51.5% మందికి అది జరగలేదు.
‘లిబ్‌టెక్’ సూచనలు..
ఉపాధి హామీలో తిరోగమనాన్ని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో తొలగించిన జాబ్‌కార్డులను పునరుద్ధరించాలి. దీనికోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి. జిల్లాలవారీగా పనుల కేటాయింపు జరపాలి.
అత్యంత తక్కువగా పనిదినాలు నమోదైన మేడ్చల్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం పని వేతనాల కోసం ‘ఈకేవైసీ తప్పనిసరి’ నిబంధనను వెంటనే తొలగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


