అడవిలో 8 కి.మీ. నడిచొచ్చి ఓటేసి..

ఓటు వేసేందుకు అడవిలో వాగు దాటి వెళ్తున్న రేగళ్లగుంపు గొత్తికోయలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రేగళ్లగుంపునకు చెందిన గొత్తికోయలు కారడవిలో రాళ్లూరప్పల మార్గంలో వాగులూ వంకలూ దాటి 8 కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లి ఓటు వేశారు. 20 ఏళ్ల కిందట ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన 45 గొత్తికోయ కుటుంబాలు బచ్చువారిగూడెం పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం 200 మందికి పైగా జనాభా ఉన్న ఇక్కడ 97 మందికి ఓటుహక్కు ఉంది. ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రేగళ్లగుంపునకు చెందిన గొత్తికోయలంతా కాలినడకన బచ్చువారిగూడెం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. చంటి బిడ్డలున్న తల్లులు సైతం వారిని ఎత్తుకుని ఎనిమిది కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి మరీ ఓటు వేయడం విశేషం. -న్యూస్‌టుడే, అశ్వారావుపేట గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఫామ్‌హౌస్‌లకు దారేదంటే..
హైదరాబాద్శివారుల్లో కొన్నేళ్ల క్రితం వరకూ అక్కడక్కడ మాత్రమే ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు కనిపించేవి. -

సర్పంచి బరిలో తల్లీబిడ్డల సవాల్..!
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. -

ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించండి
రాష్ట్రంలో 105 నియోజకవర్గాల్లో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం సమీకరించబోయే రూ.30 వేల కోట్ల రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. -

ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్
హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని వివాదాస్పద ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) భూములపై విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. -

ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదే
ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ (50) హైదరాబాదీగా తేలింది. -

‘పోలవరం’ చట్టవిరుద్ధవిస్తరణను అడ్డుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరాన్ని చట్టవిరుద్ధంగా విస్తరిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని.. విస్తరణకు సంబంధించిన అనుమతులు నిలిపివేసేలా ఏపీతోపాటు కేంద్ర సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని మంగళవారం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. -

వణుకుతున్న సంగారెడ్డి.. ఆసిఫాబాద్ జిల్లాలు
కనిష్ఠ ఉష్ణోగ్రతలతో సంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలు వణికిపోతున్నాయి. -

జనవరిలో దావోస్‌కు సీఎం
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా 2026 జనవరిలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. -

తెలంగాణలో వేగంగా 42 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ: కిషన్‌రెడ్డి
తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో సమీక్షించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. -

దేశ ఔన్నత్యాన్ని కాపాడడంలో ఇందిరాగాంధీది కీలకపాత్ర: భట్టి విక్రమార్క
భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కీలకపాత్ర పోషించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -

‘రామగుండం’ యూరియా 70% తెలంగాణకే ఇవ్వాలి
రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో 70% తెలంగాణకే కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ, పరిశ్రమల శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -

ఈసారి డిగ్రీ వరకు బడిబాట
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచడంపై విద్యాశాఖ దృష్టిసారించింది. -

ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తుల వేలానికి అనుమతి
హైదరాబాద్‌కు చెందిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్‌కు సంబంధించి జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి బాధితులకు దామాషా పద్ధతిలో చెల్లించాలంటూ మంగళవారం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -

ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల పట్టివేత!
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలం తర్వాత మావోయిస్టుల కదలికలు వెలుగుచూశాయి. -

‘పది’ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్!
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు యోచిస్తున్నారు. -

జులై నాటికి ‘ఏదుల’కు కృష్ణా జలాలు
నాగర్‌కర్నూల్ జిల్లా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మూడో ప్యాకేజీలోని ప్రధాన కాలువలో అడ్డంకిగా మారిన బండరాయి తొలగింపు పనులను వేగంగా చేపట్టి... జులై నాటికి ఏదుల జలాశయం వరకు కృష్ణా జలాలను తరలించనున్నారు. -

సింగరేణి ఇన్‌ఛార్జి సీఎండీగా కృష్ణభాస్కర్
సింగరేణి సంస్థకు ఇన్‌ఛార్జి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్‌ను నియమిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -

‘ఉపాధి హామీ’ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు కేంద్రం కుట్ర
పేదలకు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి పక్కకు తప్పుకొనేందుకు, ఈ పథకంలో నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ధ్వజమెత్తారు. -

ఆక్రమణల్లో దేవుడి భూములు
రాష్ట్రంలో ఆలయాల భూములను అడ్డగోలుగా ఆక్రమిస్తున్నారు. దేవాదాయశాఖ సమాచార హక్కు(సహ) చట్టం కింద ఇచ్చిన సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది. -

జనవరి 3 నుంచి టెట్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీజీ టెట్) జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.








