Ponguleti srinivasa Reddy: కేసీఆర్‌ దత్తత గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Eenadu icon
By Telangana News Desk Published : 19 Jun 2025 03:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

 నేడు మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి

ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, వారికి గురువారం మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఇళ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో మోసపోయిన ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్లు 2020 నవంబరు 1న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ ప్రకటించారు. 2021 జూన్‌ 22న గ్రామసభ నిర్వహించి స్థానికులతో సహపంక్తి భోజనం చేసి... బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేస్తానని, ప్రతి కుటుంబానికి రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆరోజు నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే దాకా ఆయన గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. తన ఫాంహౌస్‌కు వెళ్లడానికి రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేసి ప్రజలకు నిలువనీడ లేకుండా చేశారు. బాధితులు ఇళ్లు కోల్పోయి తాత్కాలికంగా గుడిసెలు, టెంట్లు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. వారిని ఇందిరమ్మ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు  గ్రామంలో సర్వే నిర్వహించి... ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన 205 మందిని గుర్తించాం. వారికి ఇంటి మంజూరు పత్రాలను గురువారం స్వయంగా నేనే అందజేస్తాను’’ అని పొంగులేటి పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని