Kavitha: కేసీఆర్ ఫొటో లేకుండానే ‘జనం బాట’
భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేశాక.. ఆయన ఫొటో పెట్టుకోవడం నైతికత కాదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ 

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నకవిత
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, బంజారాహిల్స్: ‘‘ఇప్పుడు సాకారమైంది భౌగోళిక తెలంగాణ మాత్రమే. సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరముంది. సామాజిక తెలంగాణ అంటే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాదు. ఓసీల్లో పేదలు, మహిళలు, యువత కూడా. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తూనే.. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తా’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘జనం బాట’ యాత్ర కొనసాగిస్తామని.. ప్రజల అభిప్రాయాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ‘జనం బాట’ పోస్టర్‌ను బుధవారం కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ఫొటో లేకుండా ‘జనం బాట’ కార్యక్రమం జరగనున్న మాట నిజమే. ఇది ఆయనను అగౌరవపరిచే చర్య ఎంతమాత్రం కాదు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. అయితే, భారత రాష్ట్ర సమితి నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత.. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఫొటోతో ‘జనం బాట’ పట్టడం నైతికంగా సరికాదు. కేసీఆర్ అనే చెట్టు నీడలో ఉన్నన్ని రోజులు.. ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేశా. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడినందుకే.. కుట్ర చేసి నన్ను పార్టీ నుంచి పంపించారు. నా దారి వేరైనప్పుడు.. ఆ దారిలో ధైర్యంగా వెళ్లాల్సి ఉంటుంది’’ అని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, భాజపా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


