Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. హైదరాబాద్‌ సహా తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

Eenadu icon
By Telangana News Team Published : 29 Oct 2025 09:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్‌ సహా తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, గాంధీనగర్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, బీఎన్‌రెడ్డినగర్‌, మీర్‌పేట్‌, బాలాపూర్‌, బడంగ్‌పేట్‌, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్‌, జవహర్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 

ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ వర్షపాతం

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో 19.7 సెం.మీ, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18.5 సెం.మీ, నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్టూర్‌లో 18.3 సెం.మీ, ఐనోలులో 17.8 సెం.మీ, నల్గొండ జిల్లా ఎర్రారంలో 15.1, పోలేపల్లిలో 13.3 సెం.మీ, రంగారెడ్డి జిల్లా వెలిజాలలో 13.9, వనపర్తి జిల్లా రేవల్లిలో 12.6, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌లో 11.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉరువకొండ, కల్వకుర్తి, వెల్దండ, ఆమన్‌గల్‌, వంగూర్‌, చారగొండ మండలాల్లో వర్షం కురుస్తోంది. దీంతో మంద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈక్రమంలో ఎర్రవల్లి-గోకారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బైరాపూర్‌ వద్ద రోడ్డుపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అచ్చంపేట-శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్ర వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జిపై నుంచి నీరు వెళ్తోంది. మిడ్జిల్‌ మండలం కొత్తూరు-వేలుగోముల మధ్య దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

పలు జిల్లాలకు వర్షసూచన

తుపాను ప్రభావంతో నేడు ఆదిలాబాద్, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు నల్గొండ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.(Tealangana News)

వర్షపాతం వివరాలివీ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు