MICE Tourism: మైస్‌ టూరిజం 2.0

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వచ్చే నాలుగు నెలల్లో హైదరాబాద్‌కు వేల మంది విదేశీ పర్యాటకులు, వ్యాపారుల రాక 
వారు రాష్ట్రంలో పర్యటించేలా టూరిజం కార్పొరేషన్‌ ప్రణాళిక

విదేశీ, ఇతర రాష్ట్రాల పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మైస్‌ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు హైదరాబాద్‌లో పలు గ్లోబల్‌ సదస్సులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టూరిజం కార్పొరేషన్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొంది స్తోంది. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల వివరాల్ని తెలుసుకుని వారు రాష్ట్రంలోని ఆకర్షణీయ ప్రదేశాల్లో పర్యటించేలా చేయాలని లక్ష్యం పెట్టుకుంది. మైస్‌(మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్‌) టూరిజం 2.0తో సంస్థ ముందుకెళ్తోంది. ‘వ్యాపార పని కోసం రండి.. తెలంగాణను దర్శించండి’ అనే నినాదాన్ని కూడా సిద్ధం చేసింది.

హోటళ్లలో డెస్కులు 

  • దేశ, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే లక్ష్యంతో ఈ నెలలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 
  • డిసెంబరులో అంతర్జాతీయ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, జనవరిలో బిట్స్‌ పిలానీ సంస్థ గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనున్నాయి.ఈ క్రమంలో హైదరాబాద్‌కి వచ్చే వేల మంది విదేశీ పర్యాటకులు, దేశీయ బిజినెస్‌ టూరిస్టుల దృష్టిని తెలంగాణ వైపు తిప్పేలా బ్రోచర్లు, డిజిటల్‌ విజువల్స్‌ను టూరిజం కార్పొరేషన్‌ సిద్ధం చేస్తోంది. వాటిని హోటళ్లు, ఎయిర్‌పోర్టు, కాన్ఫరెన్స్‌ వేదికల్లో ఉంచనుంది. టూరిస్టులు బస చేసే హోటళ్లలో ప్రత్యేక టూరిజం డెస్కులు ఏర్పాటుచేయడంతోపాటు ఈవెంట్ల ఆర్గనైజర్లతోనూ ప్రచారం చేయనుంది. 
  • ‘దేశ, విదేశీ ప్రతినిధులు వారి తిరుగు ప్రయాణం విమాన టికెట్లు బుక్‌ చేసుకోవడానికి ముందే తెలంగాణ పర్యాటక ప్రదేశాల సమాచారం అందేలా చూస్తాం. తద్వారా ఆసక్తి ఉన్నవాళ్లు తమ షెడ్యూల్‌ తయారు చేసుకోగలరు. వారు కోరితే అన్ని ప్రదేశాలను చూపించేలా కస్టమైజ్ట్‌ టూరిజం ప్లాన్‌లను అందిస్తాం’ అని టూరిజం కార్పొరేషన్‌ ఎండీ వల్లూరి క్రాంతి తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు