Fact Check: తెలంగాణలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా? నిజమెంత?

హైదరాబాద్: మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్ ధరలు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) పెంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. కొందరు చేస్తోన్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అధికారికంగా వివరణతో ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అక్టోబర్ 6, 2025న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ విధించాం. కానీ ఆ తర్వాత తెలంగాణలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో ఎలాంటి టికెట్ ధరలనూ పెంచలేదు. (Fact Check)
సాధారణంగా, ఆర్టీసీ బస్సు టిక్కెట్ల ధరలు డీజిల్ ధరకు అనుగుణంగా పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా, టీజీఎస్‌ఆర్టీసీ ధరల పెరుగుదలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి లేఖ రాస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిస్తుంది. కాకపోతే, టికెట్లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ వసూలు చేస్తున్న విషయం చాలా కాలం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి తెలియకపోవచ్చు’’ అని నాగిరెడ్డి తన వివరణలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

నోటి క్యాన్సర్‌ను గుర్తించేలా.. 3డీ యాప్ రూపకల్పన!
-

రైలు చూసేందుకు బాగుంది.. కానీ..: వందేభారత్ ‘రూపకర్త’ కీలక వ్యాఖ్యలు
-

పెన్షన్ కోసం.. చనిపోయిన అమ్మలా వేషం వేసి!
-

ఫిల్మ్‌మేకర్‌కు ఇంతకన్నా అవమానం ఉంటుందా?: వేణు ఊడుగుల ఎమోషనల్ స్పీచ్
-

ఇలాగే ఉంటే 2050 నాటికి సగం మంది ఊబకాయులే..!
-

ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందం ఖరారైనట్లేనా?


