కంగుతినేలా రంగు.. ఒక వైపు పల్లెవెలుగు, మరోవైపు ఎక్స్‌ప్రెస్ బస్సు

ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులకు ఒక రంగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, సూపర్ లగ్జరీ బస్సులకు ఒక రంగు ఉండటం సాధారణమే. కానీ ఒక వైపు పల్లెవెలుగు, మరోవైపు ఎక్స్‌ప్రెస్ బస్సు రంగు ఉంటే.. ఆశ్చర్యమే కదూ! అయితే, పల్లెవెలుగు రంగును చూసి.. ఇది తమ ఊరిలో ఆగుతుందని ఎక్కుతున్న ప్రయాణికులు అది ఎక్స్‌ప్రెస్ బస్సు అని తెలుసుకుని కంగుతింటున్నారు. కొత్తగూడెం ఆర్టీసీ డిపో పరిధిలో ఓ బస్సు ఇలాగే తిరుగుతోంది. బస్సుకు రెండు వైపులా పల్లెవెలుగు రంగు ఉంటే.. ముందుభాగంలో ఎక్స్‌ప్రెస్ రంగు ఉంది. బస్సుల కొరతతో ఒకే బస్సుకు రెండు రకాల సర్వీసుల రంగులు వేయించామని, రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు సేవలందిస్తున్నామని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈనాడు, ఖమ్మం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.








