శాకాహారంతోనూ ప్రొటీన్లు!
బిజీగా ఉండే వారు అలసట కలగకుండా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర కండర వ్యవస్థ దృఢమవుతుంది. దీంతో ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా సునాయాసంగా....
శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, కండరాలు బలోపేతం కావాలన్నా ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రత్యేకించి ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు... ఊపిరి సలపని పనులతో నిత్యం బిజీగా ఉండే వారు అలసట కలగకుండా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర కండర వ్యవస్థ దృఢమవుతుంది. దీంతో ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా సునాయాసంగా అన్ని పనులు చేసుకోవచ్చు. అలాగే ప్రొటీన్లు గుండె బలంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకూ దోహదం చేస్తాయి. తగినన్ని ప్రొటీన్లు లభించే ఆహారం తీసుకుంటే తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.
శాకాహారంతోనూ..
సాధారణంగా చేపలు, చికెన్, మటన్ లాంటి మాంసాహార పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా లభ్యమవుతాయి. అయితే మాంసాహారం అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతుంటాయి. దీంతో చాలామంది మాంసాహారం మానేసి శాకాహారానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఇదే సమయంలో శాకాహారం తీసుకునే వారిలో చాలామంది ప్రొటీన్ల లోపంతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అయితే ప్రొటీన్లు అధికంగా ఉండే కొన్ని శాకాహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పైగా కూరగాయలు, పండ్ల నుంచి లభించే ప్రొటీన్లతో అమైనో యాసిడ్లు నేరుగా శరీరానికే అందుతాయని, ఇవి కండరాలను బలోపేతం చేస్తాయంటున్నారు. మరి ప్రొటీన్లు పుష్కలంగా దొరికే కొన్ని శాకాహార పదార్థాలేమిటో తెలుసుకుందాం రండి.
పప్పుధాన్యాలు
కందులు, పెసలు, మినుములు మొదలైన వాటిలో ఉండే పోషకాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిలోని పీచు పదార్థాలు కూడా శరీర బరువును పెరగకుండా చేస్తాయి. అదేవిధంగా వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి.
చిక్కుళ్లు
కిడ్నీ బీన్స్ (రాజ్మా), బ్లాక్ బీన్స్ వంటి చిక్కుడు జాతికి చెందిన పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ప్రొటీన్లతో పాటు బి-విటమిన్, ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. అంతేగాకుండా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి.
నట్స్
ప్రొటీన్లతో నిండి ఉండే బాదం పప్పు, పిస్తా, అక్రోట్ వంటి గింజలను ప్రతిరోజూ తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు కొన్ని రకాల విటమిన్లు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నట్స్‌లో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పచ్చి బఠాణీలు
ఒక కప్పు పచ్చి బఠాణీల్లో 8 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరంగా ఉండచ్చు. ఇవేకాక వీటిలో ఏ, కె, సి విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
సోయా బీన్స్
సోయాబీన్స్‌లో మాంసాహారంతో సమానంగా ప్రొటీన్లు ఉంటాయి. ఇందులోని బి, డి, ఇ- విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్, అన్శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి రక్తపోటు సమస్యను నివారిస్తాయి. సోయాలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సమ్మేళనం మహిళల్లో మెనోపాజ్ సమస్యలను నివారించడంతో పాటు రొమ్ము క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!