Afghan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..6.3 తీవ్రతగా నమోదు

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఉత్తర అఫ్గాన్ నగరం మజార్-ఎ షరీఫ్ సమీపంలో రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. ఖుల్మ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తు (Earthquake in Afghanistan) కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 150 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అనేకమంది శిథిలాల్లో చిక్కుకున్నారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. ఖుల్మ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 28 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. దీంతో సమీప ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఘోర విపత్తు కారణంగా మజార్-ఎ షరీఫ్ సహా ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
పాక్ సైన్యం డాలర్లు, ఇతర లాభాల కోసం అమ్ముడుపోతుందని పాక్ జేఎస్ఎంఎం గ్రూపు ఛైర్మన్ షఫీ బుర్ఫాత్ ఆరోపించారు. - 
                                    
                                        

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఇవ్వడం ఆపేవరకు అమెరికాకు తాము సహకరించమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. - 
                                    
                                        

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
షట్‌డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్‌లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. - 
                                    
                                        

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా మతం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. - 
                                    
                                        

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. - 
                                    
                                        

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
భారత్ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ ప్రశంసించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 - 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 


