Earthquake: అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా, చిలీ తీర ప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఉషుయాకి దక్షిణంగా 219 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. తీవ్ర భూకంపం అనంతరం రెండుసార్లు ప్రకంపనలు కూడా వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిసింది.
సునామీ హెచ్చరికలు..
తీవ్ర భూకంపం నేపథ్యంలో కొన్ని నిమిషాల్లో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చిలీలోని మాగెల్లాన్ తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. అంటార్కిటిక్ భూభాగంలోని బీచ్‌లన్నీ ఖాళీ చేయాలని సూచించింది. తాజా పరిణామంపై చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బొరిక్ స్పందించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. తీర ప్రాంతాన్ని ఖాళీ చేయడంతోపాటు అధికారులు సిద్ధంగా ఉండటమే తమ తక్షణ కర్తవ్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 


