Donald Trump: మూడోసారి అధ్యక్ష పదవి.. ట్రంప్ ఏమన్నారంటే..?

Eenadu icon
By International News Team Updated : 29 Oct 2025 10:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మూడోసారి అధ్యక్ష పదవి కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) వెల్లడించారు. అందుకు రాజ్యాంగం అనుమతించదని చెప్పారు. ‘‘ఎన్నికల గణాంకాల ప్రకారం నేను ముందువరుసలో ఉన్నాను. అయితే నేను పోటీ చేయడానికి అనుమతి లేదని అనుకుంటున్నాను. చూద్దాం.. ఏం జరుగుతుందో. ప్రజల నుంచి మద్దతు ఉన్నా పోటీకి అనుమతి లేకపోవడం దారుణం’’ అని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌ (Donald Trump).. తన కఠిన నిర్ణయాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన మనసులోని మాట బయటపెట్టిన సంగతి తెలిసిందే. 2028లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాలనే ఆలోచనను ట్రంప్‌ తోసిపుచ్చారు. ఈ ఆలోచన చాలా క్యూట్‌గా ఉందన్న ఆయన.. ప్రజలు దీన్ని ఇష్టపడరన్నారు. ఉపాధ్యక్షుడిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఉందని, అది తనకు ఇష్టం లేదని తెలిపారు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. వాటి గురించి తాను ఇంకా ఆలోచించలేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ జాన్సన్ స్పందించారు. ట్రంప్ మూడోసారి ఎన్నికకు రాజ్యాంగంలో ఎలాంటి మార్గం లేదని తెలిపారు. 

గాజాలో శాంతిని ఎవరూ అస్థిరపర్చలేరు: ట్రంప్

ఈ సందర్భంగా గాజా గురించి మాట్లాడారు. అక్కడ శాంతియుత పరిస్థితులను ఎవరూ అస్థిరపర్చలేరని వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ నడుచుకోకపోతే.. ఇజ్రాయెల్ (Israel) దాడులు చేయడం సమర్థనీయమేనని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు అమెరికా బలగాలను మోహరించదని, అయితే ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. 

Tags :
Published : 29 Oct 2025 10:01 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు