Donald Trump: అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తాం: ట్రంప్

బుసాన్: మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రకటించారు. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీకి ముందు ‘ట్రూత్ సోషల్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘‘అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడ[ు నిర్ణయించుకున్నా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశముంది. అందుకే మన దేశం మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశాను’’ అని ట్రంప్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 - 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 


