Earthquake: డ్రీక్‌ పాసేజ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Eenadu icon
By International News Team Published : 22 Aug 2025 10:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ అమెరికాను శుక్రవారం భూకంపం వణికించింది. డ్రీక్‌ పాసేజ్‌లో ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.5గా నమోదైంది (Earthquake Hits Drake Passage). భూ ఉపరితలానికి 11 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించామని  యూఎస్‌ జియోలాజికల్ సర్వే(USGS) వెల్లడించింది. ఈ ప్రకంపనల కారణంగా సునామీ ముప్పు పొంచిఉండటంతో చిలీ దేశం అప్రమత్తమైంది. సునామీ హెచ్చరికలు జారీ చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దక్షిణ అమెరికా, అంటార్కిటికా మధ్య ఈ డ్రీక్ పాసేజ్ (జలవనరు) ఉంటుంది.

ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం (Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 8.8గా తీవ్రత నమోదైంది. ఈ భారీ భూప్రకంపనల ధాటికి రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. పసిఫిక్‌ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని