Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం

ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేసియా (Indonesia)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదైంది. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వాతావరణ, జియోఫిజిక్స్ సంస్థ ‘బీఎంకేజీ’ వెల్లడించింది. పశ్చిమ ఇండోనేసియాలో మధ్యాహ్నం 12:49 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి, సహాయక చర్యలు ప్రారంభించాయి. అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సుమారు 27 కోట్ల జనాభా కలిగిన ఇండోనేషియాను భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వెంటాడుతూనే ఉంటాయి. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్‌లో ఈ ప్రాంతం ఉంటుంది. 2021లో ఇండోనేసియాలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 2018లో ఆ దేశంలోని పాలూ ప్రాంతంలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఆ తరువాత వచ్చిన సునామీ కారణంగా 2,200 మందికి పైగా మృతి చెందారు. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 - 
                        
                            

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్‌లు.. వ్యాపారి గిఫ్ట్
 


