Elon Musk: ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా మస్క్..?

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కొన్నేళ్లలో మరో ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా (Tesla) విస్తరణ లక్ష్యాలు చేరుకుంటే.. ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద సంస్థ సీఈవోగా ఆయనకు భారీ మొత్తం సమకూరనుంది. దీంతో ఆయన సంపద అమాంతం పెరిగి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (Trillionaire) చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ ఇప్పటికే తొలి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సంపద విలువు సుమారు 400 బిలియన్ డాలర్లు. అయితే, రానున్న రోజుల్లో మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు టెస్లా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువను రానున్న పదేళ్లలో భారీగా పెంచాలని ప్రతిపాదించింది.
ఇందుకోసం రోబోట్యాక్సీ, ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలను పెట్టింది. ఈ పనితీరు లక్ష్యాలను ఎలాన్ మస్క్ సాధిస్తే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద ఆయనకు భారీగా షేర్లు సమకూరుతుంది. దాదాపు 900 బి.డాలర్లు సమకూరనున్నట్లు అంచనా. దీంతో మస్క్ సంపద విలువ ట్రిలియన్ డాలర్లు దాటిపోతుంది. మరోవైపు కార్పొరేట్ చరిత్రలోనే ఇది భారీ ప్రోత్సాహకంగా మిగలనుంది. అమెరికా అధ్యక్షుడితో ఎలాన్ మస్క్ విభేదాల తర్వాత టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతోపాటు చైనాలోని బీవైడీ తదితర కంపెనీల నుంచి పోటీ కూడా పెరిగింది. జర్మనీలో కూడా అమ్మకాలు పడిపోయాయి. ఈయూ దేశాల్లో ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టెస్లా భారీ విస్తరణ అంచనాలను వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ఏలూరు జిల్లాలో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 


