గాజాలో యుద్ధం ముగిసింది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఈరోజు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరి వెళ్లారు. విమానంలో బయలుదేరే ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొననున్నట్లు పేర్కొన్నారు.
మరికొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది. దీంతో రెండేళ్ల అనంతరం బందీలు విడుదల అవుతుండడంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ తొలుత ఇజ్రాయెల్ చేరుకొని పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబ సభ్యులను కలవనున్నారు. అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్లనున్నారు. షర్మ్ ఎల్-షేక్‌లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
2023 అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో కొంతమందిని హమాస్ విడుదల చేయగా, కొంతమందిని ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. మరికొంత మంది మరణించగా, ప్రస్తుతం హమాస్ వద్ద 48 మంది బందీలు ఉన్నారు. వారిని హమాస్ తిరిగి అప్పగించనుంది. అయితే వారిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు సమాచారం. ఇక బందీల అప్పగింతకు ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. వీరంతా సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

హర్మూజ్ సమీపంలో.. ఇరాన్ మైన్లేయర్స్పై భీకర దాడులు
Iran: హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్స్‌ను, నేవీ షిప్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా దళాలు ప్రకటించాయి. -

ఇరాన్లో నల్లటి ఆమ్ల వర్షం
ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు పలు వార్తా సంస్థలు ప్రచురించాయి. అది నల్లటి ఆమ్ల వర్షమని మరికొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. -

దద్దరిల్లిన పశ్చిమాసియా
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్, లెబనాన్‌లపై అమెరికా-ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడగా.. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1,700 మంది మరణించారు. -

యుద్ధం నుంచి బయటపడదాం
ఇరాన్‌పై యుద్ధం నుంచి బయటపడటంపై అమెరికా మల్లగుల్లాలు పడుతోందా..? ఏదో ఒక కారణంతో దానిని త్వరగా ముగించాలని చూస్తోందా..? అమెరికాలో ప్రజల మద్దతు కోల్పోవడం, ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోందా.! -

తడిసి మోపెడవుతున్న అమెరికా వ్యయం
ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు పాల్పడుతున్న అమెరికా అందుకోసం అత్యంత ఖరీదైన అత్యాధునిక ఆయుధాలను వాడుతోంది. -

పెజెష్కియాన్‌కు పుతిన్ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. రాజకీయంగా యుద్ధానికి పరిష్కారం చూడాలని అభిప్రాయపడ్డారు. మంగళవారం పెజెష్కియాన్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. -

మా సైనికులు 140 మంది గాయపడ్డారు: అమెరికా
ఇరాన్‌తో పది రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో తమ సైనికులు 140 మంది గాయపడ్డారని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వారు స్వల్పంగానే గాయపడ్డారని మంగళవారం వివరించింది. -

డ్రోన్ల తయారీ సంస్థలో ట్రంప్ కుటుంబం పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం ఆయుధ తయారీ రంగంపై దృష్టిపెట్టింది. పవరస్ అనే ప్రముఖ డ్రోన్ తయారీ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. -

కెనడా కాల్పుల్లో ఓపెన్ ఏఐపై పిటిషన్ దాఖలు
కెనడాలోని ఓ పాఠశాలలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల్లో తీవ్రంగా గాయడిన ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు చాట్‌జీపీటీ సేవలనందించే సంస్థ ఓపెన్ ఏఐపై బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -

కెనడాలో అమెరికా దౌత్య కార్యాలయంపై కాల్పులు
కెనడాలోని టొరంటో నగరంలో అమెరికా దౌత్య కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు. -

నేపాల్-భారత్ బంధం మరింత బలోపేతం: ఆర్ఎస్పీ
అభివృద్ధి కేంద్రీకృత దౌత్యంతో నేపాల్-భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) చీఫ్ రబీ లామిఛానే పేర్కొన్నారు. -

ఇరాన్‌పై యుద్ధం.. 48 గంటల్లో ఆయుధాల ఖర్చు రూ.51వేల కోట్లు!
గడిచిన పది రోజులుగా ఇరాన్‌పై అమెరికా భీకర స్థాయిలో దాడులు చేస్తోంది. ఇందుకోసం అత్యాధునిక ఆయుధాలను వాడుతోంది. -

ఇరాన్‌పై యుద్ధం.. అమెరికన్లు ఏమనుకుంటున్నారు..?
ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యపై అమెరికన్లలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. -

పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో రష్యానే ‘విజేత’..!
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -

వ్యూహాల్లో మేటి.. సైన్యంతో మైత్రి!
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టనున్న మొజ్తాబా ఖమేనీ.. వ్యూహరచనలో మేటి. ముఖ్యంగా తెరవెనుక మంత్రాంగాలు నడపడంలో నేర్పరి. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం నేతగా ఉన్నప్పుడు మొజ్తాబా చాపకింద నీరులా తన ప్రాబల్యాన్ని విస్తరింపజేసుకున్నారు. -

అమెరికాకు రక్షణ కవచాల కొరత!
‘‘మేం ఆయుధాల కొరతను ఎదుర్కోవడం లేదు. ఎప్పుడూ లేనంతగా మా దగ్గర నిల్వలు ఉన్నాయి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చెబుతున్నా.. రక్షణ నిపుణులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం మూడు నుంచి నాలుగు వారాలు దాటి కొనసాగితే ఆయుధాల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -

అందుకే ఇరాన్ నౌకలను ముంచేస్తున్నాం: ట్రంప్
Donald Trump: ఇరాన్ నౌకలను ముంచడానికి గల కారణాన్ని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. -

డ్రోన్ల తయారీ సంస్థలో ట్రంప్ కుటుంబం పెట్టుబడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డ్రోన్ల తయారీ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. -

నాటి టెహ్రాన్ సీక్రెట్ రైడ్‌తో.. నేటి యుద్ధానికి బీజం..!
ఇరాన్ వద్ద 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం నిల్వ ఉంది. దీనిని స్వాధీనం చేసుకోనిదే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకురాదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక కమాండో బృందాలను ఇరాన్‌లోకి పంపి శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం లేదా ధ్వంసం చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. -

యుద్ధం నుంచి వైదొలుగుదాం: ట్రంప్‌నకు సహాయకుల విజ్ఞప్తి..?
ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం నుంచి వైదొలుగుదామని ట్రంప్‌ను ఆయన సహాయకులు కోరినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.






