అమెరికాకు చీకటి రోజులివి: బైడెన్

వాషింగ్టన్: అమెరికాకు ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయినప్పటికీ ఆశావాద దృక్పథంతో ఉండాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 82 ఏళ్ల బైడెన్ బోస్టన్‌లో ఆదివారం ఎడ్వర్డ్ ఎం.కెన్నడీ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆదివారం జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘‘అమెరికాలో ఇప్పుడున్నవి చీకటి రోజులు. అయితే తప్పకుండా దేశం మళ్లీ సరైన గాడిన పడుతుంది. ఎప్పట్లాగే మరింత బలంగా పుంజుకుంటుంది. మనం విశ్వాసం కోల్పోకూడదు’’ అని పేర్కొన్నారు. ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేశాధ్యక్షుడు ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాల విషయంలో హద్దులు మీరుతున్నారంటూ విమర్శించారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌కు ఇటీవల రేడియేషన్ చికిత్స చేయించుకున్న అనంతరం బైడెన్ బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 


