Hurricane Melissa: జమైకాను భయపెడుతున్న హరికేన్‌ మెలిసా!

Eenadu icon
By International News Team Published : 28 Oct 2025 10:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కరేబియన్‌ దేశం జమైకా (Jamaica)లో హరికేన్‌ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా ఇప్పటికే ఇక్కడ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మెలిసా (Melissa) తుపాను ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేన్లలో అత్యంత తీవ్రమైనదని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. 

ఈ మెలిసా తుపాన్‌ను కేటగిరీ-5గా వర్గీకరించారు. ఇది మరింత తీవ్రతరమై.. మంగళవారం తెల్లవారుజామున కరేబియన్‌ ద్వీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను నేపథ్యంలో జమైకాతో పాటు హైతీ, డొమినికన్‌ రిపబ్లిక్‌లలో నలుగురు మరణించారు. అమెరికాకు చెందిన నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ (NHC) ప్రకారం.. ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైనదని పేర్కొంది. మెలిసా కారణంగా గంటకు 280 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా కుండపోత వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌సీ డైరెక్టర్‌ మైఖేల్‌ బ్రెన్నాన్‌ పేర్కొన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

రానున్న నాలుగు రోజుల్లో జమైకాలోని కొన్ని ప్రాంతాల్లో 100 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది. భారీ వరదల కారణంగా హైతీలో వందలాది ఇళ్లు మునిగిపోయాయి.  జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్‌ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అధికారుల ఆదేశాలను పాటించాలని కోరారు. హరికేన్‌ తీవ్రతరం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను పాఠశాల బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని