Jai Shankar: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధంపై భారత్‌ ఆందోళన చెందుతోంది: జై శంకర్‌

Eenadu icon
By International News Team Updated : 02 Oct 2024 10:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్‌- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత్‌ ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్‌లోని థింక్‌ తాంక్‌ కార్నేగీ ఎండోమెంట్‌ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఈమేరకు ఆయన వ్యాఖ్యానించారు. 

‘భారత్‌ కేవలం ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య యుద్ధం గురించే ఆందోళన చెందడం లేదు. లెబనాన్‌, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ సంఘర్షణ విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతోంది. అక్టోబరు 7ని తీవ్రవాద దాడిగా మేము పరిగణిస్తాం. ఇజ్రాయెల్‌ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాం. అయితే.. ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది ఎంతో ముఖ్యం. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నా’ అని జై శంకర్‌ పేర్కొన్నారు. 

హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా హత్యతో పాటు ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటుంది. మంగళవారం రాత్రి దాదాపు 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఈ దాడులను ఇజ్రాయెల్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది. 

Tags :
Published : 02 Oct 2024 10:11 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని