Gaza: గాజాలో మళ్లీ రక్తపాతం
కాల్పుల విరమణకు తూట్లు
ఇజ్రాయెల్ భీకరదాడులు
104 మందికిపైగా పాలస్తీనియన్ల మృతి
డెయిర్ అల్-బలా: గాజాలో మళ్లీ రక్తం ఏరులై పారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడింది. మంగళవారం రాత్రి నుంచి భారీస్థాయిలో గాజావ్యాప్తంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 104 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 46 మంది చిన్నారులు ఉన్నారు. 600 మందికి గాయాలయ్యాయి. దాడులు ముగిసిన వెంటనే, మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని, అందుకే దాడులకు ఆదేశాలిచ్చానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. దాడులను ట్రంప్ సమర్థించారు. ఇజ్రాయెల్ సైనికుడినొకరిని హమాస్ హతమార్చిందని, అందుకే టెల్అవీవ్ దాడులకు పాల్పడిందన్నారు. దీన్ని హమాస్ ఖండించింది. కాల్పుల విరమణను ఇజ్రాయెలే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అఫ్గాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 


